Suryaa.co.in

Andhra Pradesh

దాతలు ఆదుకోవాలని వినతి

జగ్గయ్యపేట: పట్టణంలోని ఆర్టీసీ కాలని లో ఇటీవల వరదల కారణంగా ఒక కాలు పూర్తిగా తొలగించి రెండవ కాలుకు ఇన్ఫెక్షన్స్ సోకి హాస్పటల్లో వైద్యం చేయించుకుంటున్న కొత్తా బవదిప్ (12)బాలుడి కుటుంబ సభ్యలని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని బాలుడు తండ్రి కోరుతున్నారు.

బాలుడు తండ్రి కొత్తా నాగరాజు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలు తమ కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా దెబ్బతీసాయని అన్నారు. అయితే మీడియా సహకారంతో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కృషితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బాలుడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పది లక్షలు 24 గంటల్లో మంజూరు చేశారని… ఇంకా ఎంత అవసరమైతే అంతా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు.

అయితే హాస్పటల్లో కొన్ని రకాల టెస్టులకు, ఇతర ఖర్చులకు తమ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని.ఇంకా రెండు నెలల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని.మానవత్వం కలిగిన అనేక రకాలైన ఫౌండేషన్లు, దాతలు ఉన్నారని అందరూ పెద్ద మనసుతో తమ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు.
ఫోన్ పే 9912788516 లేదా 7075915789. KOTHA NAGARAJU అకౌంట్ నెంబర్ 50100329594666 ఐఎఫ్ఎస్సి కోడ్ HDFC0002367 కి ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.

LEAVE A RESPONSE