ప్రకటనలలో ప్రధాని ఫోటో వేయాలని తెలియదా?:లంకా దినకర్

Spread the love

అమరావతి : సీఎం జగన్ తీరు సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టుందని, ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నాయకుడు లంకా దినకర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రైతు భరోసా కోసం ఇచ్చే 13,500 రూపాయలలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కాదా? అని ప్రశ్నించారు. పీఏం కిసాన్ నిధులు కలిపి ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోవడం లో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దాదాపు అన్ని పథకాలలో 45 నుంచి 50 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నా, జగన్ తన జేబులో డబ్బులు ఇస్తున్నట్లు తన స్టిక్కర్‌తో మాయ చేస్తున్నాడన్నారు. అవసరమైన ప్రతిసారీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు తీసుకునే ముఖ్యమంత్రి కేంద్రం నిధులు వాడుతున్నప్పుడు ప్రకటనలలో ప్రధాని ఫోటో వేయాలని తెలియదా? అని లంకా దినకర్ ప్రశ్నించారు.

Leave a Reply