Suryaa.co.in

Telangana

విమాన ప్రమాదంపై డాక్టర్ కె. లక్ష్మణ్ విచారం

హైదరాబాద్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దీ నిమిషాల్లోనే కూలిపోవడం, మంటల్లో చిక్కుకుని పలువురు ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసిన విమాన ప్రమాద దృశ్యాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE