సైకిల్ ఎక్కనున్న నరసరావుపేట అనన్య హాస్పటల్ అధినేత,సింగరాజు ఫౌండేషన్ ఛైర్మన్ డా॥సింగరాజు సాయికృష్ణ

నరసరావుపేట అనన్య హాస్పటల్స్ అధినేత,సింగరాజు ఫౌండేషన్ ఛైర్మన్ డా॥సింగరాజు సాయికృష్ణ తన అనుచరులతో కలసి సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరనున్నారు.

ఇప్పటికే విస్తృతమైన సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్ళిన డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరబోతున్న విషయాన్ని అంతర్గతంగా తెలుసుకున్న పలువురు వైకాపా,జనసేన పార్టీ నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ ఆయన అనుచరులతో కొన్నిరోజులనుండి మంతనాలు జరిపిన డా॥సింగరాజు సాయికృష్ణ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

కాపు సామాజిక వర్గంలో అంచెలంచెలుగా ఎదిగిన డా॥సింగరాజు సాయికృష్ణ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల వాడలలో ఉచిత మెగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం,కరోనా సమయంలో కరోనా వారియర్స్ కు ఉచితంగా వైద్యసాయం అందజేయడం,వేసవిలో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అనాధ మరియు వయోవృద్దులు, దివ్యాంగులకు ఉచిత వైద్యం అందించడంతో పాటు అనాధ,వృద్ద ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ ప్రజలలో చెరగని ముద్రవేసుకున్న డా॥సింగరాజు సాయికృష్ణ.. తన అనుచరులతో పాటు టీడీపీలో చేరికతో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్శీనారాయణ కు, కాపు సామాజిక వర్గంతో పాటు ఆయా సామాజిక వర్గాల మద్దతుతో కన్నాలక్ష్మీనారాయణకు బలం చేకూరనుంది.

Leave a Reply