Home » డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే

డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే

– టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో చనిపోయారు. మాస్కులు లేకుండా ఎలా పనిచేయాలని తన బాధను గుర్తుచేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేసి పిచ్చివానిగా ముద్రేశారు. ఒక దళిత డాక్టర్ కు జరిగిన అన్యాయంపై మేము హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా సుధాకర్ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.
సుధాకర్ మృతికి ప్రధాన కారణం ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరోనాను తేలిగ్గా తీసుకుని ఎంతోమంది చనిపోవడానికి ఆయనే కారణం. కాబట్టి ముఖ్యమంత్రిని ప్రధమ ముద్దాయిగా చేర్చి ఆయనపై చార్జ్ షీట్ ఓపెన్ చేసి చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కరోనా సమయంలో సకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాస్కులు, ఇతర సదుపాయాలు కల్పించి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. తన బిడ్డకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని సుధాకర్ తల్లి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సుధాకర్ కు మెంటల్ అని వైసీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఆడబిడ్డల పేర్లను వాడుకోవడం సిగ్గుచేటు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సబబు? అమ్మ, అక్క, కూతుళ్ల గురించి నోటి కొచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టానుసారంగా దారుణమైన పదజాలం వాడుతున్నారు. పిల్లలతో కలిసి టీవీ చూడలేని పరిస్థితి తీసుకొచ్చారు. మాట్లాడే తీరులో పద్దతి పాటించడంలేదు. మంత్రి పేర్ని నాని దిగజారి మాట్లాడుతున్నారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుసా? ఇలా దిగజారడాన్ని రాజకీయ వ్యభిచారం అంటారు. ఇవాళ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్న వారు రేపు మాపైన మాట్లాడరని నమ్మకమేంటి?
మహిళలను గౌరవించడం చేతకాని వైసీపీ నేతలకు నీతులు చెప్పే అర్హత లేదు. వైసీపీ నేతలు మహిళలపై మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రాజకీయాలంటే భయమేస్తోంది. దిశా చట్టం, మహిళా కమిషన్ , మహిళా హోంమంత్రి అంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడం ముఖ్యమంత్రికి నచ్చుతున్నట్టుంది. ఆయనది సైకో మనస్తత్వం. అయ్యన్నపాత్రుడు గారు నా కొడుకా అని మాట్లాడిన మాటకు వైసీపీ నేతలు నానా హడావుడి చేశారు. చంద్రబాబు గారి ఇంటిపైనే ఏకంగా దాడి చేశారు. మరి పేర్ని నాని, పోసాని కృష్ణ మురళి మాటలు వినసొంపుగా ఉన్నాయా? వారు చెప్పేది సూక్తి ముక్తావళా? ముఖ్యమంత్రికి మహిళలను తిట్టడం సంగీత విభావరిలా ఉన్నట్టుంది.
రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పన్నులు పెంచి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారు. మీ పాలనను ప్రజలు ఛీ కొడుతున్నారు కాబట్టి బీహార్ కు చెందిన పీకేను తీసుకొచ్చారు. లక్షల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. దానిపై విచారణ జరపమంటే మాకే సంబంధం లేదని పోలీసులు చెప్పడం దారుణం కాదా? ప్రభుత్వం చేస్తున్న వెధవ పనులు బయట పడకుండా గ్రామ సింహాలను తీసుకొచ్చి రోడ్డుపైన అచ్చోసిన అంబోతుల్లా వదిలేశారు. మహిళలను దూషించే సంస్కృతిని వదిలిపెట్టండి. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఎక్కడుందో తెలీదు.
మహిళలపై దాడులు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ…టీడీపీ నేతలను విమర్శించాలంటే మాత్రం పరుగెత్తుకొచ్చేస్తారు. హోంమంత్రి గురించి చెప్పేదేముంది? మహిళల పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన పేర్ని నాని, పోసాని కృష్ణ మురళిపై నిర్భయ యాక్ట్ కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ( Nirbhaya act section 509 IPC , gesture or act intended to insult the modesty of a woman shall be punished with simple imprisonment for a term which may extend to 3 year, and also with fine) మరోసారి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడవాళ్లను బయటకు తీసుకొస్తే తగిన బుద్ధి చెప్తాం.

Leave a Reply