– మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే లక్ష్యం
భీమవరం: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మూలాలు ఉన్న ప్రాంతంగా భీమవరం పేరు కూడా విన్పిస్తోంది. మహనీయులకు నిలయమైన భీమవరం ప్రాంత పేరుప్రతిష్టలకు కొందరు మాయని మచ్చను తీసుకొచ్చారు. కస్టమ్స్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల దృష్టి ఇప్పుడు భీమవరం పైనే ఉంది. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు దీనికి బానిసలవుతున్నారు. అనధికార ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ, ధనార్జనే ధ్యేయంగా ఉన్న హాస్టల్ నిర్వాహకుల పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణం. యువతను ముఖ్యంగా విద్యార్థుల జీవితాలను నిర్వీర్యం చేసే స్థాయికి గంజాయి, డ్రగ్స్ మాఫియా తయారైంది.
ఏడాదిన్నర క్రితం నెదర్లాండ్స్ నుంచి ఆట వస్తువులుగా ఓ పార్సిల్ భీమవరం పట్టణానికి చెందిన కురెళ్ల భానుచందర్ పేరిట రావడంతో కస్టమ్స్ అధికారులకు సందేహం వచ్చింది. పరిశీలించగా రూ. 12 లక్షలు విలువైన డ్రగ్స్ పిల్స్ ఉండటంతో అప్రమత్తమయ్యారు. ఆన్లైన్లో డ్రగ్స్ రప్పించి ఏజెంట్లు ద్వారా గంజాయి,
డ్రగ్స్ వ్యాపారం చేస్తు న్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు బృందం భీమవరం వచ్చి భానుచందర్ నివాసంలో తనిఖీలు చేయడం అప్పట్లో కలకలం రేగింది. ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భానుచందర్ ని విచారించి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న మరి కొందరిని అరెస్టు చేశారు.
మళ్లీ ఇప్పుడు మరోసారి భీమవరంలో డ్రగ్స్ పడగ విప్పింది. గుంటూరులో ఓ యువకుడు పట్టుబడగా భీమవరంలో మరికొందరు పేర్లు చెప్పాడు. దీంతో గుంటూరు, భీమవరం స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో బృందం భీమవరం చేరుకున్నారు. గుంటూరులో అరెస్ట్ అయిన ఉయ్యాల రోహిత్ కొన్నేళ్లుగా భీమవరంలోనే ఉంటున్నాడు. ఇతని వద్ద నుంచి 8 ఎడ్ స్టాప్స్ అనే మత్తు మందు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ ను తీసుకుని భీమవరం చేరుకున్న అధికారులు ఒక లాడ్జిలో దిగి వలపన్నారు.
నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన సింగుదాసు రిత్వికు అరెస్ట్ చేసి ఎండీఎంఎ అనే మత్తు మందు ఒక గ్రాము, 5 ఎడ్లీ స్టాంప్స్, 5 ఏక్ట్ సీ మాత్రలు, 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన భూపతిరాజు రాజాఉపేంద్ర తన కారులో 100 గ్రాముల గంజాయి తీసుకెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఈ కేసులు, అరెస్టుల వివరాలను భీమవరం ఎబీ ఇన్ స్పెక్టర్ వీవీఎస్ఎన్ వర్మ ప్రకటించారు. వేర్వే రు మత్తు పదార్థాలు, గంజాయి విక్రయం, వినియోగం కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. పట్టుబడిన వారిలో విద్యార్థులు ఉన్నారు.డ్రగ్స్, గంజాయి సరఫరా చేసే ముఠాలపై పోలీస్, ఎస్ బీ యంత్రాంగం ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. దాడులు, తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులను విచారించి మూలలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.
బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరులో నివాసం ఉంటున్న కేరళకు చెందిన డెల్విన్, షాహిల్ అనే ఇద్దరు వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సింగనూరు రిత్విక్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి పశ్చిమ గోదావరి జిల్లాలో విక్రయి స్తున్నట్లు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో గుర్తించింది. భీమవరం, ఏలూరు తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలింది. జిల్లాలో కొన్ని రాత్రి పార్టీల్లో రహస్యంగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు అరెస్ట్ అయిన యువకులు అధికారులకు చెప్పినట్లు సమాచారం. తీగ లాగితే డొంక కదిలింది తీగ లాగితే డ్రగ్స్ డొంక కదిలింది. రిత్వికన్ను లోతుగా విచారిస్తుండటంతో లింకులు బయటకి వస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చేసే ముఠా, విక్రయదారులు, వినియోగదారుల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి ఏ విధంగా డ్రగ్స్ రవాణా జరుగుతోంది..? గంజాయి ఎక్కడ నుంచి సరఫరా అవుతుంతోందన్న వివరా లను స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, ట్ఫార్సులు రాబట్టే పనిలో నిమగ్నమయ్యాయి.