-
జగన్ ఆదేశం?
-
ఇమేజ్ పెంచుకునే వ్యూహం
-
మహిళలకు దూరం కాకూడదన్న ముందుచూపు
-
పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశం
-
ఇప్పటికే విజయసాయి ఎపిసోడ్‌తో వైసీపీకి అ‘శాంతి’
-
ఈలోగా ద్వారంపూడి కామలీల అంటూ సోషల్‌మీడియాలో గత్తర
-
దువ్వాడ ఎపిసోడ్ మధ్యలో బయటపడ్డ పిన్నెల్లి అన్న కొడుకు రాసలీల
-
పిన్నెల్లి అన్నకొడుకుకి మహిళల బడితపూజ
-
వై‘కామ’ పార్టీ అంటూ సోషల్‌మీడియాలో నిందలు
-
ఇమేజ్ డామేజీ కాకుండా జగన్ దిద్దుబాబు
-
అందులో భాగంగానే దువ్వాడ రాజీనామాకు ఆదేశం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైకాపా కాస్తా వై‘కామ’పార్టీగా మారిన నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ దిద్దుబాటుకు దిగారు. భవిష్యత్తులో మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న జగన్.. మహిళల నుంచి నిరసనలు-ప్రశ్నలు-విమర్శలు ఎదురుకాకుండా ఉండేందుకు.. తన పార్టీకి చెందిన రాసలీల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో రాజీనామా చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు దువ్వాడను పార్టీ-ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలని జగన్ స్వయంగా ఆదేశించినట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కట్టుకున్న భార్యను వదిలేసి.. కళాకారిణి అయిన తన పార్టీ మహిళా నేత మాధురితో సహజీవనం చేస్తూ, భార్యాపిల్లలకు దొరికిపోయి అల్లరైన శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను, తన ఎమ్మెల్సీ-పార్టీ పదవికి రాజీనామా చేయమని జగన్ ఆదేశించారట. సొంత భార్య వాణి- ప్రియురాలు మాధురి ఎపిసోడ్ రోడ్డున పడటంతో, పార్టీ పరువు కూడా రోడ్డున పడింది.
దానిపై జగన్ ఇప్పటిదాకా స్పందించకపోవడం మిహళలను పార్టీకి దూరం చేసే ప్రమాదం తెచ్చింది. దీనితో దిద్దుబాటుకు దిగిన జగన్.. తన పార్టీ నేత దువ్వాడకు ఫోన్ చేసి, తన పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఆయన రేపో, మాపో తన ఎమ్మెల్సీ-పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానితో మహిళలలో తన ఇమేజ్ కాపాడుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
త్వరలో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నందున.. మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకూడదన్న ముందుచూపుతోనే, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ట్వీట్లు, పర్యటనల ద్వారా జగన్ మళ్లీ యాక్టివ్ అవుతున్న క్రమంలో.. తనపై వ్యక్తిగతంగా-పార్టీపరంగా మహిళల నుంచి ఎలాంటి విమర్శలు ఎదురుకాకూడదన్నది జగన్ యోచనగా అర్ధమవుతోంది.
ఇప్పటికే పార్టీని ‘మహిళలతో అక్రమ సంబంధాల అనైతిక వ్యవహారం’ గబ్బుపట్టించింది. తొలుత ఒక మహిళకు తన ఫ్యాంటు జిప్పు తీసి చాటింగ్ చేసిన అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ ఘనత ఢిల్లీ వరకూ పాకింది. అధికారం పోయిన తర్వాత.. తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు ఎంపి విజయసాయిరెడ్డి తండ్రి అంటూ.. ఎండోమెంట్ ఏసీ శాంతి భర్త మీడియా సమక్షంలో చేసిన రచ్చ, వైసీపీ ఇమేజీని భారీగా డామేజీ చేసింది. దానితో స్పందించిన విజయసాయిరెడ్డి, తనకు శాంతితో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అదే నిజమైతే విజయసాయిరెడ్డి డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధంగా ఉండాలని, శాంతి భర్త సవాల్ చేశారు.
ఆ తర్వాత శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య-జడ్పీటీసీ వాణి, కూతురును విడిచిపెట్టి, మాధురి అనే పార్టీ మహిళలతో కలసి ఉన్న వైనాన్ని ఆయన భార్య రోడ్డెక్కి మరీ వెలుగులోకి తెచ్చింది. దువ్వాడ-మాధురి కలసి ఉన్న సమయంలో ఆ ఇంటిముందు, భార్య-కూతురు ధర్నా చేయడంతో ఆగ్రహించిన దువ్వాడ, పోలీసుల సమక్షంలోనే వారిపై దాడి చేయడం రచ్చ అయింది.
దీనితో వైసీపీ సహజంగానే మహిళలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడినప్పటికీ, పార్టీకి 40 శాతం ఓట్లు రావడానికి మహిళలే కారణమన్నది జగన్ విశ్వసిస్తున్నారు. దానితో ఈ ఘటనపై జగన్ నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, కూటమి మహిళా నేతలు వైసీపీపై మూకుమ్మడి దాడి చేయడంతో, జగన్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.
మరోవైపు సోషల్‌మీడియాలో వైకాపాను వై‘కామ’పార్టీగా ముద్రవేస్తూ చేసిన ప్రచారంతో మహిళలు పార్టీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి, ద్వారంపూడి, పిన్నెల్లి అన్న కొడుకు ఫొటోలు పెట్టి ‘యువర్స్ సెక్సీ రొమాంటిక్ కంపేనియన్ పార్టీ’ అంటూ వైఎస్సార్‌సీపీకి సరికొత్త భాష్యం ఇచ్చిన వైనం పార్టీ ఇమేజీని భారీగా డామేజీ చేసింది. విచిత్రంగా వైసీపీలో పెద్దనోరు చేసుకుని ప్రత్యర్ధులపై విమర్శలు చేసే రోజా, అనిత, సునీత, కళ్యాణి, వాసిరెడ్డి పద్మ, చివరకు జగనన్నకు దన్నుగా ఉండి సోషల్‌మీడియాలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే శ్రీరెడ్డి కూడా, దువ్వాడ ఎపిసోడ్‌పై మౌనంగా ఉండటమే విచిత్రం. అంటే దువ్వాడ ఎపిసోడ్ పార్టీని ఎంత ఇబ్బందిపెట్టిందో అర్ధం చే సుకోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
త్వరలో జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న జగన్‌కు.. మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా చూసేందుకే, దువ్వాడతో రాజీనామా చేయిస్తున్నారంటున్నారు.
ఒకవైపు దువ్వాడ ఎపిసోడ్ పార్టీని భ్రష్ఠుపట్టించిన సమయంలోనే.. మరోవైపు మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అన్న కొడుకు, స్కూల్లో చదివే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పార్టీని అడ్డంగా ఇరికించింది. ఆ ఘటనలో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి, పిన్నెల్లి అన్న కొడుకును దేహశుద్ధి చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయి, పార్టీని భ్రష్ఠుపట్టించింది.
తాజాగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఒక దళిత మహిళతో సహజీవనం చేసిన వైనం వెలుగులోకి రావడంతో జగన్ తలపట్టుకోవలసి వచ్చింది. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా సీసీ కెమెరాలు పెట్టి ద్వారంపూడి బంధించారని, ఆమెకు పుట్టబోయే బిడ్డకు సంబంధించి స్కానింగ్ కూడా చేయించారంటూ సోషల్‌మీడియాలో గత్తరయింది. ఇలాంటి వ్యవహారాల వల్ల మహిళలు పార్టీకి పూర్తిగా దూరం కాకుండా ఉండకుండా, తన పార్టీ నేతలకు చెక్ పెట్టేందుకే దువ్వాడతో రాజీనామా చేయిస్తున్నారన్నది వైసీపీ వర్గాల కథనం.