Suryaa.co.in

Andhra Pradesh

ఇ.హెచ్.ఎస్. అమల్లో సమస్యల పరిష్కారానికి భేటీ అయిన స్టీరింగ్ కమిటీ

అమరావతి, ఫిబ్రవరి 16: ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమల్లో సమస్యల పరిష్కారానికై స్టీరింగ్ కమిటీ సమావేశం బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాకులో జరిగింది. స్టీరింగ్ కమిటీలోని సభ్యులైన పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమై ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)
Whats-App-Image-2022-02-16-at-18-48-28 అమల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఎపి జెఎసి, ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక, ఎపి సచివాలయం సంఘం మరియు ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల అధ్యక్షలు ఈ సమావేశంలో పాల్గొని ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లో ఉద్యోగుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సినదిగా విజ్ఞప్తిచేశారు.

ఈ సందర్బంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) పై సమగ్రంగా చర్చించడం వల్ల పలు ముఖ్యమైన అంశాలపై చక్కని స్పష్టత ఏర్పడిందని, మరికొన్ని అంశాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మార్గం సుగమం అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వీటితో పాటు అన్ని ముఖ్యమైన అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లి వాటి అమలుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వినోద్ కుమార్, ఆరోగ్య పథకం(EHS) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.టి.ఎస్.ఆర్.మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE