విజయవాడ రైల్వే స్టేషన్ మరో మైలురాయిని అధిగమించింది. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార విధానాలను అవలంబించినందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ ధ్రువీకరణ లభించింది. 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి విజయవాడ ఆదర్శప్రాయమైన ప్రామాణిక 5 స్టార్ ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేషన్‌ను సాధించింది.