ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓట్లు నమోదుకు అవసరమైన పత్రాలు అన్నింటిని అందుబాటులో ఉంచామని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తెనపల్లి పట్టణం హోలీ ఫ్యామిలీ పాఠశాల లో విద్యావంతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్నా రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.