Suryaa.co.in

Andhra Pradesh

ఓటింగ్‌ ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్‌ విఫలం

-పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంత అయోమయమా?
-చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదు
-మరో రెండురోజులు గడువు పెంచాలి
-పోలీసు సిబ్బందికి నోడల్‌ ఆఫీసర్‌పై డీజీపీ స్పందించాలి
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

మంగళగిరి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని, ఓటు వినియోగించుకోకుం డా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అయోమయం లేకుండా ఉద్యోగస్తులు తమ ఓటు సక్ర మంగా వినియోగించుకునేలా చేయడంలో ఎలక్షన్‌ కమిషన్‌ విఫలమైందని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు ఇంకా క్లారిటీ లేదని, ఉద్యోగులు సక్రమంగా ఓటు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్‌ కమిషన్‌దేనని పేర్కొన్నారు. ప్రధాని రాక నేపథ్యంలో ఆయన పర్యటన విధుల్లో పాల్గొనే వారికి 9,10 తేదీల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నారు.

పోలీసు సిబ్బంది ఓటుహక్కుపై డీజీపీ స్పందించాలి
పోలీసు ఆఫీసర్లు విధి నిర్వహణలో పక్క రాష్ట్రాల్లో ఉన్నారు. వారి ఓటు వినియోగించునేలా వారిని వెనక్కి పిలిపించాలి. ఒక వేళ వారు వెనక్కి రావడంలో ఇబ్బంది ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలి. అసలు పోలీసు నోడల్‌ ఆఫీసర్‌ ఎవరో తెలియడం లేదు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అడుగుతుంటే చెప్పడం లేదు. ఎలక్షన్‌ కమిషన్‌ను అడుగుతుంటే చెప్పండం లేదు. మంగళగిరి 6వ బెటాలియన్‌ నుండే 300 మంది పోలీసు సిబ్బంది బయట రాష్ట్రాల్లో విధుల్లో ఉన్నారు. మొత్తంగా 1500 మందికి పైగా పోలీసులు అధికారులు పక్క రాష్ట్రాల్లో విధుల్లో ఉన్నారు. వెంటనే పోలీసు నోడల్‌ ఆఫీసర్లు ఎవరన్నది తెలియజేయాలి. దీనిపై వెంటనే డీజీపీ స్పందించాలి.

హోంగార్డుల పరిస్థితి దయనీయం..జీతాలివ్వడంలో విఫలం
జగన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో హోంగార్డులకు పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్లకు ఇవ్వాల్సిన జీత భత్యాలు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీడీపీ అధికారంలోకి రాగానే వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటారు. వారికి రావాల్సిన బకాయిలను వెంట నే చెల్లిస్తాం. వారి కుటుంబాలకు కావాల్సిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి సాను కూలంగా వ్యవహరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

జగన్‌రెడ్డి ఓటమిని ముందుగానే ఒప్పుకున్నారు…
ఈ ఐదేళ్లు పోలీసులు పడ్డ మానసిక క్షోభ టీడీపీ అధికారంలోకి వస్తే ఇక పోలీసులకు ఉండదు. ఇకపై గౌరవ ప్రధంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉంటుంది. ఎవరి పంచనో చేరే పరిస్థితి ఉండదు. చట్టబద్ధంగా పోలీసులు విధులు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉంటుంది. ఎవరి దయా దాక్షిణ్యాలపై లోబడి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఏ డీజీపీ జగన్‌రెడ్డికి భజన చేశారో ఆయనపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్‌ మాటల్లో డొల్లతనం బయటపడిరది. జగన్‌రెడ్డి తన ఓటమిని ముందే అంగీ కరించారు. జగన్‌ తొత్తులు ముందే పెట్టె సర్థుకుంటున్నారు. కొత్త డీజీపీ న్యాయంగా ఉంటారు కాబట్టే జగన్‌రెడ్డి భయపడుతున్నారు. జగన్‌ రెడ్డికి ఓటమి భయం..తన మాటల్లో స్పష్టమవుతోందని తెలిపారు.

LEAVE A RESPONSE