Suryaa.co.in

Features

బాబు వస్తేనే విద్యుత్‌ వెలుగులు

2014 – 19 మధ్యకాలంలో లోటు విద్యుత్ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది.. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పార్కులు, విండ్ మిల్స్ ఏర్పాటుతో.. పునరుత్పాదక ఇంధన వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. చార్జీలు పెంచకుండా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించారు దార్శనికుడు చంద్రబాబునాయుడు.

‘గృహవిద్యుత్ వినియోగదారులకు’ విద్యుత్ చార్జీలు పెంచలేదు.
‘పరిశ్రమలకు’ పవర్ హాలిడేలు ప్రకటించలేదు, ఇప్పటిలా స్లాబులు మార్చి చార్జీల బాదుడు లేదు.
‘వ్యవసాయదారులకు’ 9 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు ముందు సబ్సిడీపై తరువాత ఉచితంగా సోలార్ పంపుసెట్లు అందించారు.
ఆక్వా రైతులకు ఇచ్చిన యూనిట్ 1.50 విద్యుత్తుకు ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ లాంటి నిబంధనలు పెట్ట లేదు.
ఇక ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చిన 150 యూనిట్ల కరెంటుకు.. స్థానిక తండాలు, కాలనీల్లోనే నివసించాలనే నిబంధన పెట్టలేదు.
2018 చివర్లో… విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం అని కూడా చంద్రబాబు ప్రకటించడం మనకందరికీ తెలిసిన విషయమే.

దురదృష్టవశాత్తు ఒక్క చాన్సు ప్రభుత్వం రావడంతో… సగటున ఏటా 2 సార్లు విద్యుత్ చార్జీలు పెంచుతూ… సవాలక్ష నిబంధనలు విధిస్తూ.. విద్యుత్ స్లాబులు కూడా మార్చి ప్రజల్ని వీరబాదుడు బాదుతుండడం కూడా మనందరికీ తెలుస్తోంది.

సంపాదనలో పావు వంతు విద్యుత్ బిల్లులకే సరిపోవడంలేని నేటి పరిస్థితుల్లో…ఆలోచించు ఆంధ్రుడా !

– ప్రదీప్‌
నందిగామ

LEAVE A RESPONSE