Home » ఉద్యోగులు..ఉద్యోగ సంఘాల గతి..!

ఉద్యోగులు..ఉద్యోగ సంఘాల గతి..!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టుమీది శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు ..రాజా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఒక కధ చెబుతాను విను అంటాడు.
ఒకనాటి ఉద్యానవనం వారి వ్యక్తిగత..వృత్తి ఉద్యోగజీవితం..!
కష్టపడో ఇష్టపడో చదివి పోటీ పరీక్షలనెదుర్కుని ప్రభుత్వ కొలువు సంపాదించుకుంటారు.
ఇక జీవితంలో స్ధిరపడినట్టే అని భావిస్తారు.
బ్రిటీష్ ఇండియా లో …ఆంగ్లేయుల మాదిరి వారి జీవనవిధానం మారిపోతుంది. అయినా కొందరి జీవితాలు గొడ్డు చాకిరీ కి అంకితమవుతాయి.
ఇక అన్ని శాఖల్లోనూ విపరీతమైన అమ్యామ్యా..!
వారి స్ధాయిని బట్టి వసూళ్ళు..!
కట్టల పాముల్ని ఏ పుట్టలో పెట్టాలో తెలియనంతగా పిల్లల్ని పెట్టేస్తాయి.
బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది.
ఆడింది ఆట పాడింది పాట..!
ఎవరైనా నిలదీసినా ..ప్రశ్నించినా దూషించినా ప్రభుత్వ రక్షణ ఉంటుంది.
దాంతో స్ధిమితంగా తమ విధులు మొక్కుబడిగా నిర్వహిస్తు ఉంటారు.
జీతం తో పాటు గీతం తమ హక్కు అనుకుంటారు.
అధికారులయితే తమ కింది వారిని బానిసలు గా చూస్తారు.
వాళ్ళు ప్రజల్ని పీడించి తమ అక్కసు తీర్చుకుంటారు.
ప్రైవేటు వ్యాపారాలు..రియల్ ఎస్టేట్ ఇంకా ఇతర ఆదాయమార్గాలు ఎంచుకుంటారు.
పని చెయ్యటమంటే ఎంతో చిరాకు..!
పని చేసే ముఖ్యమంత్రి పాలనలో కొస్తే ఓడించే దాకా నిద్ర పోరు.
ఎన్నడూ లేనంత అనవసరనిజాయితీ ప్రదర్శించి ప్రజల్ని ఇక్కట్ల కు గురిచేస్తారు.
ఎప్పటి కప్పుడు..జీత భత్యాల పెంపు..సౌకర్యాల గురించి ..ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంటారు.
ప్రభుత్వ పెద్దలు కూడా వారి ఒత్తిడి కి తల ఒగ్గుతారు.
రాష్ట్ర విభజన తర్వాత..ఏర్పడిన ప్రభుత్వం ..అప్పటి ముఖ్యమంత్రి ఉద్యోగుల తో సఖ్యత గా ఉండటానికి ప్రయత్నం చేశారు.
అంతకు ముందు ఆయన వైకిరి కి విరుద్దంగా ..వారికి వరాల జల్లు కురిపించారు.
స్వేచ్ఛ నిచ్చారు.
పని ఒత్తిడి తగ్గించారు.
రాష్ట్రం ఆర్ధికంగా లోటు లో ఉన్నా అనేక ప్రయోజనాలు కల్పించారు.
పదవీవిరమణ కాలాన్ని పెంచారు.
జీతాలు ఠంచను గా మొదటి తారీఖున ఇచ్చేవారు.
ఐదురోజులు పనిదినాలు ..!
ప్రయాణ ఖర్చులు..నివాస భృతి ఇచ్చేవారు.
పక్కరాష్ట్రం ధనిక రాష్ట్రంతో సమానంగా ..ఇంకా చెప్పాలంటే మరింత ఎక్కువగా అన్ని ప్రయోజనాలు సమకూర్చారు.ఇన్ని చేసి…కొత్త రాష్ట్రం బాగా పనిచెయ్యండి..రాష్ట్రాన్ని అభివృద్ది పధం లో నడిపించాలని అడిగారు.ఉద్యోగులు కూడా అలాగే చేసినట్టు కనిపించారు.సీపీయస్ విధానాన్ని రద్దు చెయ్యమని అడిగారు ఉద్యోగులు..!అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసిన విధాన నిర్ణయం ..!అది తప్ప గత ప్రభుత్వం ఉద్యోగుల అడుగులకు మడుగులొత్తింది.ప్రజలు కూడా ఆనాటి పాలకుడి వైకిరి కి ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు అంది ఎంతో కాలమయింది.వచ్చిన వారంలో సీపీయస్ రద్దు చేస్తామన్బ హామీ మూలన పడింది.తాహశీల్ధారు స్ధాయి అధికారుల్ని కూడా అధికార పార్టీ నాయకులు దూషిస్తున్నారు.కింది స్ధాయి వాళ్ళనయితే కొట్టినంత పనిచేస్తున్నారు.పోనీ ఎలాగోలా పని చేద్దాము..తమ కొచ్చే లంచాలు తమకొస్తాయి కదా అనుకుంటే అవీ దక్కనివ్వటం లేదు.
అన్ని రకాలుగా అవమానాలు..దాడులు.తప్పుడు పనులు చేయిస్తున్నారు.రాజ్యాంగ ..చట్ట ఉల్లంఘనల కు పాల్పడేలా చేస్తున్నారు.తమ హక్కుల కోసం ఉద్యోగ సంఘాల నాయకులు పత్రికా సమావేశం పెట్టుకోలేని పరిస్దితి.సమావేశం జరుగుతుండగానే రాజప్రాసాదం నుండి ఫోన్లు..గజగజ వణుకుతూ సంఘాల నాయకుల వేడికోళ్ళు..!నోరెత్తి అడిగే పరిస్ధితి లేదు.ఇదీ ఇప్పటి ఉద్యోగుల దౌర్భాగ్య స్ధితి.
అన్ని విధాలా ప్రయోజనం పొందిన ఉద్యోగులు ఎందుకు అప్పటి పాలకుడి కి వ్యతిరేకంగా మారారు..!?ఉద్యోగులని సంఘాల నాయకుల్ని ..అధికారుల్ని గుర్తించి గౌరవించిన ముఖ్యమంత్రి పట్ల ఎందుకు విముఖత ప్రదర్శించారు..!?ఇవాళ ఎందుకు కుక్కిన పేనుల్లాగ పడి ఉంటున్నారు..!?
రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుందంటాడు భేతాళుడు.అప్పుడు రాజు..గొంతు సవరించుకుని ఇలా చెప్పసాగాడు.
ప్రభుత్వ ఉద్యోగులు..ఒకాయన అంటే విముఖత నరనరాన జీర్ణించుకు పోయింది.
ఆయన పాలన లో వారు ఇబ్బందిగా ఫీలవుతారు.
ఎప్పుడూ చేసే పనే అయినా ..చాలా ఎక్కువ చేయిస్తున్నాడు అని భావిస్తారు.
లంచాలు తీసుకోవటం మానరు కాని బిక్కు బిక్కు మంటూ తీసుకుంటారు.
ప్రజలకు పనికొచ్చే పని చెయ్యాలంటే కష్టపడాలి ..కాని కష్టపడటం వారికిష్టముండదు.
వారి పని వారు చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుందని కుళ్ళు కుంటారు.
వారిలో కూడా కులమత ప్రాంతీయ భావనలున్నాయి.అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందినా ఆయన మీద అకారణ ద్వేషం తగ్గలేదు.కొరడా ఝుళిపిస్తున్నా ఈయన మీద మోజు తీరలేదు.ఇప్పుడిప్పుడే కాళ్ళ కిందకు నీరు చేరుతున్నా..సమయానికి జీతాలందక పోయినా ఇబ్బందులు పడుతున్నా తేలు కుట్టిన దొంగల్లా నోరు మూసుకుని ఉంటున్నారు.నోరు విప్పితే కొరడా దెబ్బలు ఉంటాయి.గతాన్ని తలుచుకుని వగచి..ప్రయోజనం లేదని తెలిసి..నిర్వికారంగా..తమ విధులు నిర్వర్తిస్తున్నారు.
తమకు తగిన శాస్తి జరిగిందని మాత్రం లోలోన కుములుతున్నారు.అయినా ఎదురు తిరగలేక పోతున్నారు.
భయం ఎంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు.చేసిన పాపం ఊరికే పోదని అంటారు అందుకే..!రావాలి కావాలి అంటూ కోరుకున్న వారు..విజయోత్సవ సంబరాలు చేసుకున్నవారు బిక్క చచ్చిపోయారు. నాయకులు మాత్రం మేడ మీద మేడ కడుతున్నారు.రోమన్ సామ్రాజ్యానికి బానిసల్ని అమ్మినట్టు సంఘాల నాయకులు ..ఉద్యోగుల్ని తాకట్టు పెట్టేసారు.తప్పదు భరించాలి.రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా చెట్డు మీదకు చేరుకున్నాడు.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

Leave a Reply