రుణానుబంధం..

ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.
ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే…
మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా, ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.
ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలోని మన మీదగల పగ తీర్చుకోవడానికి, మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా, ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.
మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.
మనం చేసిన ఉపకారానికి బదులుగా, ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు.

Leave a Reply