Home » సమాజంలో చేవచచ్చిందా?

సమాజంలో చేవచచ్చిందా?

-కశ్మీర్ పండిట్‌ను చంపినా స్పందనేదీ?
– ఆ ముష్కరులు కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రారని గ్యారంటీ ఏమిటి?
నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఒక కాశ్మీరీ పండిట్ ని పోరాటంకాదు.. యుధ్ధం కాదు.. ఈ 68 ఏళ్ళ పండితుని వలన జరిగిన ఏ అపకారమూ లేదు ..తన మందుల షాప్ లో తన పని చూసుకుంటుంటే, ముష్కురలు వచ్చి నాలుగు తుపాకీ గుళ్ళు పేల్చి నిండుప్రాణం తీశారు ..కారణం ఏమిటి ? ఆ పెద్దాయన చేసిన ద్రోహం ఏమిటి? ఆయన కేవలం హిందువు అవటం ! ఆయన కాశ్మీరీ పండితుడవటం !! ఆయన భారతదేశంలో అంతర్భాగం అయిన కాశ్మీర్ లో నివసించటం !!! అందుకని ఆయనను కిరాతకంగా హత్య చేశారు.
టెర్రరిస్టులో తీవ్రవాదులో మానవత్వం లేని రాక్షసులో వారిమతం తప్ప, ఇక ఏ మనిషీ ప్రాణాలతో మనకూడదు అనే మతోన్మదం.. ఆప్రొఫెసర్ ని తాకిన గుళ్ళు వికృతంగా అరిచి చెపుతున్నాయి. బీదవారికి ఉచితంగా మందులిచ్చే మానవత్వం, మౌనంగా కన్నీళ్ళు కాదు . . రక్తాన్ని చిందించిది ..
హిందువులను తూలనాడే ఎగతాళి చేసే కాంగ్రెస్క.మ్యూనిష్టులూ ..సెక్యులరిష్టులూ.. జర్నలిస్టులూ .. ఇదేం ఘోరం అని ఇప్పుడైనా మీ నోరువిప్పండి . ఇదేం న్యాయమో ఉ పన్యాసాలివ్వండి . మీఛానెల్స్ లో బర్ఖాదత్ లాంటి వాళ్ళ ను కూర్చోపెట్టి , డిబేట్లు పెట్టండి . మూడు రోజులవుతున్నా ఎవరినీ ఈ సంఘటన కదిలించలేదు ..ఎవరికీ కష్టం కలిగించలేదు ..అంటే హిందువులను ఎవరు చంపినా, ఏంచేసినా సమాజం నుండి ఎలాంటి స్పందనా వుండదనేగా.. ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన గుణపాఠం!?
ఇది కాశ్మీరు లో మొదలయి.. కన్యాకుమారిదాకా పాకదని నమ్మకం ఏముంది ? దాయాదాక్షిణ్యాలు మరచి పోయిన ఒక ఉన్మాద వర్గానికి తీవ్రవాదులని పేరు పెట్టాము. ..ఈ దురన్యాయాన్ని ఖండించని ఈ నిర్జీవ సమాజానికి ఏ పేరు పెట్టాలి ? అదే ఒక ముస్లిమ్ హిందువు చేతిలో చనిపోతే .. ఈ పాటికి అక్కినేని ఇంటి సంగతి పక్కన పెట్టి, అర్జంటుగా ఛానెల్స్ గొంతు పెంచేవి .. పేపర్లు నిండిపోయేవి !
అదే ఒక హిందువు ఉత్తపుణ్యానికే నిహతుడైతే .. ఆ వార్తవంక కూడాచూడని ఈ సోషల్ మీడియా హిందువులందరికీ, మంచి సందేశం ఇస్తోంది .. మీకు మీరే న్యాయం చేసుకోవాలి. మీకోసం ఎవరూ లేరు..ఈ భారతదేశంలో మీరు వంటరి పోరాటం చేయాల్సిందే అని . మీ అందరూ కలిసి మెలిసి ఒకటవుతారో లేక ఏకాకులై అస్తిత్వాన్ని పోగొట్టుకుంటారో అని సవాల్ విసురుతోంది . ఇన్నాళ్ళూ హిందువులు ఎంతో సహనం గా ఉన్నారు. మతఛాందసం అనేది లేనేలేదు ..ఈ రోజున క్రిష్టియానిటీ సంఖ్య పెరిగిందంటే హిందువులు దానిలో చేరటం వల్లనే ..లవ్ జీహాదీలకు బలిఅవుతున్నదీ హిందువుల పిల్లలే ..అంటే దీనిని బట్టి తెలియటం లేదా? హిందువులలో మత మూఢత్వం పిల్లలకు నూరిపొయ్యనందుకే అని !
సర్వమత సమానత్వం అని బోధించినందుకే …అందరూ మనవాళ్ళే అని అనుకోబట్టే .. హిందువుల మీద ఇలాంటి ఎటాక్స్ జరుగుతున్నాయి . ఈ రెండు మూడేళ్ళలోనే నిరాయుధులపై మూకవుమ్మడి దాడులు, భైంసా, బెంగళూర్ పాల్ఘర్ లో జరిగాయి. ..విక్టిమ్స్ కి న్యాయం మాత్రం జరగలేదు.
హిందూ మతగ్రంధాలలో సమాజం వుంది. సమస్యలు అధిగమించి జీవితాలను ఆనందమయం చేసుకునే సిధ్ధాంతాలున్నాయి ..దుర్మార్గాన్ని ఎదిరించండి యుధ్ధంచేయండి అనే సందేశం ఉంది.. అంతే కాని .. మతం కోసం ప్రాణాలు తీయమనే బోధనలు ఎక్కడా లేవు, కనిపించవు .. హిందువులకు జరిగే ఈ అన్యాయాలను ఎదిరించలేని శాంతం ప్రశాంతత ఇస్తుందా ? సముద్రం లోపల బడబాగ్నిలాగా హిందువుల గుండెలు రగిలి పోవటం లేదా?
దొంగచాటుగా చంపేసిన ఆ ప్రొఫెసర్ గారి అమ్మాయి డా.శ్వేత ఎంత ధైర్యంగా… ఎంత వీరోచితంగా మాట్లాడిందో చూస్తే.. జాతీయజెండా రెపరెపలు వినిపించాయి ..”దొంగల్లా వెనక నుండి నాతండ్రిని


కాల్చినవాళ్ళు నాముందుకు రండి “. ఆ మాటలకు ఆ నికృష్ట హంతకులు వింటే సిగ్గుతో నిజంగా చచ్చిపోవాలి . ఆ అమ్మాయి మనకి ఆదర్శం. ఇలాంటి హత్యలు మనవత్వాన్ని హత్యచేసినట్లే.
హిందువులందరూ ఏకమవ్వాల్సిన సమయం ఇది ..మనందరం ఏకమయితే ఇలాటి అఘాయిత్యాలు జరగకుండా ఆపవచ్చు.. మొదట ఆపదలో వున్న వారికి, మేమంతా అండగా ఉ న్నాము మీకు అనే మనోధైర్యం కలగచేయచ్చు . ..మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుందాం . మనవాళ్ళను కాపాడుకుందాం … ఇలాంటి సంఘటనలు పునరావృతం అవకూడదు అని, ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి పూజలు ప్రార్ధనలు చేద్దాం…..జైహింద్
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply