ప్రకాశం జిల్లా పర్చూరు లో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు కాంప్లెక్స్ ఆవరణలో కొణిజేటి రోశయ్య మరియు అబ్దుల్ కలామ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్.ఎల్.ఏ ఏలూరి సాంబశివరావు, టీడీపీ నాయకులు డూండి రాకేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎవరికి హాని తలపెట్టరని, ఆర్యవైశ్యులు అందరికీ
ఉపయోగ పడే వారని, ఆర్యవైశ్యులు తలపెట్టే ఏ కార్యక్రమంలో అయినా సేవా భావం మరియు న్యాయం ఉంటుంది. ఆర్యవైశ్యులకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని… ఒక ఎమ్మెల్సీ గా,ఎమ్మెల్యే గా,ఒక ఎంపీ గా, ముఖ్యమంత్రి గా,గవర్నర్ గా ఎవర్ని నొప్పించకుండా అన్ని రకాల పదవులకు న్యాయం చేసి మన కులానికి ఒక స్ఫూర్తిగా నిలిచి డాక్టరేట్ కూడా సంపాదించుకున్న మహనీయులు మన రోశయ్య అని బాపట్ల జిల్లాకు కొణిజేటి రోశయ్య జిల్లాగా పేరు పెట్టాలని ఆర్యవైశ్య సంఘము తరపున డిమాండ్ చేస్తున్నామని డూండి రాకేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మామిడిపాక హరిప్రసాద్ ,మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పేర్ల రవి ,కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు సుబ్బారావు ,జిల్లా ఆర్యవైశ్య సంఘము ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి హరి ,ఆర్యవైశ్య సంఘము ట్రెసరర్ సురేష్ ,రాష్ట్ర ఆర్యవైశ్య సంఘము నాయకులు అర్వపల్లి ఆంజనేయులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమo పూర్తి చేసి అతి త్వరలో రెండు విగ్రహాలను నిర్మించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.