Home » మాఫియాతో ప్రజల్లో జగన్‌ విశ్వాసం కోల్పోయారు

మాఫియాతో ప్రజల్లో జగన్‌ విశ్వాసం కోల్పోయారు

– ల్యాండ్‌ టైటిలింగ్‌తో మోసగిస్తే చూస్తూ ఊరుకోం
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ బుధవారం విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యంతో 24/7 శ్రామికుడిలా శ్రమిస్తున్న మోదీ, కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ మీద ఏబీసీడీ అక్షరమాలకు అక్షరాలు కూడా సరిపోవట్లేదు. ఏ అంటే అక్రమ ఆస్తులు, బీ అంటే భూబకాసురులు, సీ అంటే కరప్షన్‌, డీ అంటే దోచుకోవడం దాచుకోవడమేనని తెలిపారు. గడిచిన పదేళ్లలో డీబీటీ ద్వారా మధ్యవర్తులు, దళారుల నుంచి ప్రజలను కాపాడి బీజేపీ పారదర్శక పాలన అందించింది. అందుకే ప్రజలు మోదీని విశ్వసించారు. జగన్‌ చేసిన ల్యాండ్‌, శాండ్‌, లిక్కర్‌, డ్రగ్‌ మాఫియా పాలన చూసి ప్రజలు ఆయనపై విశ్వాసం కోల్పోయారు. జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్‌ భూములు కూడా లాక్కున్నారు. ప్రతి వ్యవస్థలో అవినీతి చేశారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో మోసం
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో మోసం చట్టం పేరుతో ప్రజలను మోసం చేస్తే కూటమి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజలను వంచించడానికి మనసు ఎలా వస్తుంది. ఏపీలో అనుమతులు లేకుండా లక్షల టన్నుల కొద్దీ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. జాతీయ పర్యావరణ శాఖ ఎన్‌జీటీ 2022లోనే అక్రమ ఇసుకను నిషేధించింది. కానీ జేపీ సంస్థ ఆపలేదు. సుప్రీంకోర్టు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది . జేపీ అనే సంస్థకు నోటీసులు ఇచ్చినా వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇసుక ద్వారా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు సంపాదించుకున్నారన్నారు. నిర్మాణ రంగంలో ఆధారపడి బతుకుతున్న భవన నిర్మాణ కార్మికులను, ప్లంబర్లను, మేస్త్రీలను, ఎలెక్ట్రిషియన్లను సైతం జగన్‌ ప్రభుత్వం రోడ్డున పడేశారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు.

Leave a Reply