Suryaa.co.in

Andhra Pradesh

గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం

అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వెల్లడించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కాగ్ తప్పుబట్టింది. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆడిట్ నివేదికను కాగ్ విడుదల చేసింది. “వార్డు కమిటీలను | ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం వికేంద్రీకరణ పాలన కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉంది. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటం స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమే” అని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

LEAVE A RESPONSE