– మా ఫోన్లపై రేవంత్ నిఘా
– నగరంలోనే భద్రత లేని దుస్థితి
– కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్ నుంచి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ విడుదల
– బ్యాక్ టూ క్వశ్చన్ అనే టీ షర్ట్ వేసుకున్న మన్నే క్రిశాంక్
కంది: నాకు వెన్నంటి ఉన్న బిఆర్ఎస్ పార్టీ కి,నా కోసం నిరంతరం న్యాయ పోరాటం చేసిన పార్టీ లీగల్ టీం కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు.ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటాం. అంగన్వాడీ లకు మొబైల్ ఫోన్ లపై అవినీతి జరిగిందని ప్రశ్నించాను.
రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ అవినీతి పై పోరాటం చేశాను. అందుకే నన్ను 16రోజులు జైల్లో పెట్టారు. అయిన నేను వెనుకడుగు వేయను. అవినీతి అక్రమాలు బయట పెట్టిన మామీద కాదు కేసు పెట్టుడు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల పై మీరు ఫోకస్ చేయండి. గతంలో హైదరాబాద్ ATM కాద్ద కాల్పులు జరిపి దొంగలు పారిపోయారు. కరీంనగర్ జ్యువెలరీ షాపులో దొంగలు కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లారు.సీపీ సుమతి కి అర్ధరాత్రి రక్షణ లేకుండా పోయింది. IAS, IPS క్వార్టర్స్ లోనే రక్షణ లేదు
సీఎం రేవంత్ ప్రతిపక్షాలపై కాకుండా శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలి. మీడియా వాళ్ళతో కూడా మాట్లాడితే ఎందుకు మాట్లాడావు అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాపింగ్, వైఫై హ్యాకింగ్ చేస్తుందన్న అనుమానం కలుగుతుంది.