జగన్ 175 మందిని మార్చినా… వైసీపీ ఓటమి తలరాతను ఎవరూ మార్చలేరు

– తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

‘రా…కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం సాయంత్రం రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం టీడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..జగన్ తన ఎమ్మెల్యేలను నమ్మడం లేదు… జనం జగన్ ను నమ్మడం లేదు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా… అమరావతే రాజధాని అన్నాడు,ఒక్క చాన్స్ అని ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాటతో నవ్వుల పాలు చేశాడు,

ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టి.. రాష్ట్రాన్ని కూల్చేశాడు,వ్యవసాయ శాఖను మూసేశారు హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడుధాన్యం రైతు దగా పడ్డాడు,మనం పట్టిసీమ కడితే కోపంతో దాన్ని పాడు పెట్టాడు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని గోదాట్లో కలిపేశాడు. ప్రాజెక్టులు కాదు కదా.. కనీసం కాలువల్లో పూడిక తీయని ప్రభుత్వం ఇది. ఒక్క డిఎస్సీకి దిక్కు లేదు పోలీసుల ఉద్యోగాలు భర్తీ కాలేదు పెట్టుబడులు లేవు.

అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబరెంట్ కట్, రైతు సబ్సిడీలు కట్, దళిత, బిసిల పథకాలు కట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 కుపైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు.విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు, పన్నులు, పెట్రో ధరలు, బాదుడు, అప్పుల వల్ల ఒక్కో కుటుంబంపై ఈ 5 ఏళ్లలో 5 నుంచి రూ. 6 లక్షల భారం మోపాడు అందుకే ప్రజలు మూడు నెలల్లో ఈ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారు.

జగన్ పని అయిపోయింది. వైసీపీ 95% ప్రజా మద్దతు కోల్పోయింది. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు ముక్త కంఠంతో ఎపి హేట్స్ జగన్ అంటున్నారు,

Leave a Reply