దీపక్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని
అమర్నాథ్ రెడ్డి: ప్రతిరోజు పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న, నేడూ ఇదే పరిస్థితి.మాతో ఉన్నది చట్టబద్దమైన పోలీసు వ్యవస్థా? జగన్ రెడ్డి పోలీసు వ్యవస్థా?మా కార్యకర్త బాషా చేతిలో హ్యాండ్ మైక్ ఉంది. మాకు మీటింగ్ పెట్టే ఉద్దేశమే లేదు. పోలీసులు ఎందుకు లాక్కున్నారో తెలియదు. బాషాని కొట్టి, మైక్ లాక్కున్నారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పై పోలీసులు చేయి చేసుకున్నారు. పోలీసులకు మేం మీటింగ్ పెడతామని ఏమైనా సమాచారముంటే మాతో మాట్లాడితే మేం సమాధానం చెప్పేవాళ్లం కదా? మా కార్యకర్తలపై చైన్ స్నాచర్స్ మాదిరిగా మైక్ లాక్కుని రక్తగాయాలయ్యేలా గాయపర్చాడు. పోలీసుల ఈ దుశ్చర్య వెనుక ఇంటెలిజెన్స్ డీజీపీ, జగన్ రెడ్డి ఉన్నారని మాకు తెలుస్తోంది. ప్రశాంతంగా కొనసాగుతున్న పాదయాత్రపై పోలీసులు జులుం ప్రదర్శించి అలజడులు రేపుతున్నారు. పోలీసులకు ప్రజాస్వామ్యం, చట్టంపై గౌరవం ఉందా? మాపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు?
రానున్న ఎన్నికల్లో వైసీపీకి శవయాత్రే…
ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సరైన రోడ్డులేదు, పాఠశాలల్లో సదుపాయాలు లేవు, స్కూళ్ల ముందు మురుగుడు గుంతలున్నాయి. వాటిపై దృష్టిపెట్టండి జగన్ రెడ్డి. కోడికూయక ముందే ఇంటెలిజెన్స్ వాళ్లు మా పాదయాత్ర రూట్ లో నిఘా పెట్టేందుకు వస్తున్నారు. పోలీసులు కూడా వివేకంతో ఆలోచించాలి. చట్టబద్దంగా వ్యవహరించాలి. జగన్ రెడ్డి మరో సంవత్సరం మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంతో మీరు పనిచేయాలి కదా? సీఐ గంగిరెడ్డి మా కార్యకర్తలపై భౌతికదాడి చేశాడు. అతనికేం పని? పాదయాత్ర జయప్రదమైతే వైసీపీకి శవయాత్రేనని రిపోర్టులు అందుతున్నాయి. అందుకే దద్దమ్మల్లా మాపై దాడులు చేయిస్తున్నారు. మీరు ధైర్యవంతులు, నిజమైన మగాళ్లైతే, శక్తి సంపన్నులైతే మా పాదయాత్రను సజావుగా సాగనివ్వాలి. జగన్ రెడ్డికి లోకేష్ జ్వరం పట్టుకుంది. దీనికి మందు 2024లో లేదా ముందస్తుగానే వస్తుంది. మా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదు..మీ పాదయాత్రను మేం ఎక్కడా అడ్డుకోలేదు. నువ్వు ముద్దులు పెడుతుంటే మేం ఎప్పుడైనా వద్దని చెప్పామా? ఎటు తిరిగితే అటు వదిలేశాం కదా? ఇప్పటికైనా మీ దుశ్చర్యలు ఆపకుంటే ప్రజలే మీపై తిరగబడి కొడతారు. ఈ రాష్ట్రంలో లోకేష్ ఒక్కడే పాదయాత్ర చేయడం లేదు. తాడిపత్రిలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు. నిన్నంతా ఆదాల ప్రభాకర రెడ్డి రోడ్ షో, బహిరంగ సభలు పెట్టాడు నెల్లూరులో.
వాళ్లకో చట్టం…మాకో చట్టమా?
తాడిపత్రిలో ఇసుక అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు దొంగచాటుగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి. మాపై ఎన్నికేసులు పెడుతున్నారో మాకే అర్థం కావడం లేదు. పోలీసులు ఇష్టారాజ్యంగా, వాళ్లకు తోచిన విధంగా కేసులు పెడుతున్నారు. మేం నోరు మెదిపితే కేసులు పెడుతున్నారు. అన్నీ క్రిమినల్ కేసులే…అన్నీ తప్పుడు కేసులే పెడుతున్నారు.
పులివర్తి నాని:యువగళంతో వైసీపీ నాయకులకు నిద్రపట్టడం లేదు. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలు పూర్తిచేసుకుని నేడు జీడీ నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నాం. నేడు 14వ రోజు.కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు మాపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
చిన్న పొరపాట్లను భూతద్దంలో చూపిస్తూ మమ్మల్ని వేధిస్తున్నారు.నిన్న ఎన్.ఆర్ పేట, నేడు భోజన విరామ ప్రాంతంలో ఆటంకాలు.నిన్న 400మంది పోలీసు అధికారులు మా పాదయాత్రకు వచ్చారు? అడ్డుకునేందుకు కాదా?మాకు రక్షణ కల్పించేందుకు 100మంది…అడ్డుకునేందుకు వెయ్యి మంది పోలీసులు వస్తున్నారు.మా కార్యకర్తలు, నాయకులపై చేయిచేసుకున్న పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.