– ప్రజలు సంతృప్తి చెందేలా పనులు
– పథకాలపై ప్రజలకు అవగాహన అవసరం
– సమీక్షా సమావేశంలో మంత్రి సవిత
పెనుకొండ: పెనుకొండ మండల కేంద్రంలో ని ఆర్ అండ్ బి అతిథి గృహంలో పెనుకొండ మున్సిపాలిటీ, సోమందేపల్లి, పరిగి మండల అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంల చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ కింద ఇప్పటి వరకూ పూర్తైన పనుల వివరాలు, అలాగే కొనసాగిస్తున్న పనుల వివరాలు పురోగతి నివేదికను సమర్పించారు. కొత్త పనుల అంచనా వివరాలను తెలిపారు. అనంతరం అధికారులు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, ప్రత్యక్షంగా ప్రజలకు ప్రయోజనం చేకూరే పనులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పనులు సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.అర్హుల గుర్తింపు లో పక్షపాతం వద్దు, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, అభివృద్దే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. ఇప్పటికే దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం, చూపామని గ్రామాభివృద్ధి పనుల వేగవంతంగా జరగాలని, ప్రధానమైన విద్యుత్, రెవెన్యూ, హౌసింగ్, శానిటేషన్, మంచినీరు, ప్రజారోగ్యం తో పాటు అత్యవసర సేవలు పట్ల యుద్ధప్రాతిపదికన స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.