చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం: తిరువూరు నియోజకవర్గం నుంచి ఎంతమంది అయితే రా కదలిరా సభకు వెళ్తారో.. మైలవరం నియోజకవర్గం నుంచి కూడా అంతమంది తరలి వెళ్లాలి.అన్న ఎన్టీఆర్, అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి.మన ప్రాంతానికి గోదావరి నీళ్లు తేవడం కోసం ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి కేటాయిస్తే 4100 కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి.చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేది.రా కదలిరా.. యువగళం జెండాలతో చంద్రబాబు గారి సభకు తెదేపా శ్రేణులు ఆదివారం కదం తొక్కనున్నాయి అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రెడ్డిగూడెం లో నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తిరువూరులో జరగనున్న చంద్రబాబు గారి భారీ బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం కార్యకర్తలతో నాయకులతో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, జానాలపాటి వేణుగోపాల్ రెడ్డి, చెన్నుబోయిన చిట్టిబాబు, ఉయ్యూరు అంజి రెడ్డి, రాయుడు వెంకటేశ్వరరావు, ఇశ్రాయేలు, వెంకటేశ్వరరావు, కామిశెట్టి నరసయ్య, పోతురాజు, బాణావతు రమేష్, మాదల సాంబయ్య, పిడపర్తి పిచ్చిరెడ్డి, పాటిబండ్ల సత్యంబాబు, బండ్లమూడి జగదీష్ బెల్లంకొండ రాజా నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply