Suryaa.co.in

Telangana

కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

-మే నెల 10 వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర
-ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌ షో లు
-గులాబీ రథానికి ప్రత్యేక పూజలు

హైద‌రాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌ బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు..

రేప‌ట్నుంచి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది.మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది.

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌ షో లు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.తమ నియోజక వర్గాల్లో కూడా కేసీఆర్‌ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజక వర్గాల నేతల నుంచి డిమాండ్‌ వస్తున్నది. అయితే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజక వర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

LEAVE A RESPONSE