Suryaa.co.in

Andhra Pradesh

చేనేతను ప్రోత్సహిస్తా

-పద్మశాలీలకు అండగా ఉంటా
-మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని
– పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి

పద్మశాలీల సంక్షేమం కోసం చేనేత రంగాన్ని ప్రోత్సహించి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం పద్మశాలీ సంఘీయుల ఆత్మీయ సమావేశం భవానీపురం ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పద్మశాలీలు క్రమశిక్షణ కలిగిన వారని సున్నిత మనస్కులని వారి సంక్షేమం కోసం పాటుపడతానని సుజనా హామీ ఇచ్చారు పద్మశాలీయులను వైసీపీ ఓటు బ్యాంకుగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు. తాను మాటల మనిషిని కాదని చేతల్లో చేసి చూపుతానని, పేద పద్మశాలీల ఇళ్ల నిర్మాణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యులను చేయడం, పద్మశాలీలకి నామినేటెడ్ పోస్టులను కల్పించడం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటుపై కూటమి అధికారంలోకి రాగానే త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పద్మశాలీలకు తూతూమంత్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, కానీ వారి సంక్షేమానికి నిధులు మాత్రం కేటాయించలేదని సుజనా గుర్తు చేశారు. తనను గెలిపిస్తే పద్మశాలీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులు కేశనం శివ భావన్నా రాయణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో పద్మశాలీలకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట తప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో పద్మశాలీలందరూ ఐక్యంగా ఉండి వైసీపీకి గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు. నియోజకవర్గ పద్మశాలీలందరూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు దివి మురళీకృష్ణ అవ్వారు శ్రీనివాసరావు గోలి భాస్కరరావు కాజా శేషగిరిరావు ముట్టే రామచంద్రరావు పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE