Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జమానాలో జరిగేవి అన్నీ హత్యలే

విజయ సాయి ఒక దద్దమ్మ
బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్

బాపట్ల : జగన్ ప్రభుత్వం లో మధ్యం పేరుతో మారణ హోమం నడుస్తుంది అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ అన్నారు.సోమవారం బాపట్ల బీజేపీ కార్యాలయం లో జరిగిన పాత్రికేయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. ఒక వైపు మధ్యం ఆదాయం చూపుతూ బ్యాంకు లో రుణాలు తీసుకుంటూ మరోవైపు చవుక బారు మధ్యం తో ప్రాణాలు హరిస్తున్నారని దుయ్య బట్టారు. ప్రభుత్వం మధ్యం తాగి బడుగులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. యుద్ధభూమిలో చనిపోయే వాళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగి చనిపోయే వారి సంఖ్య వేలరెట్లు ఎక్కువగా ఉందన్నారు.

చవుక బారు మద్యం తో ప్రాణాలు కోల్పోయే బడుగుల పక్షం నిలిచి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి  మాట్లాడుతుంటే సమాధానం చెప్పడం చేతకాని దద్దమ్మ విజయ సాయి చేసే విమర్శలు ఆయన దివాలా కోరు తనానికి నిదర్శనం అన్నారు. ఒకవైపు రాష్ట్రం అప్పులు పాలై అల్లాడుతుంటే తమ పాలనలో మేలు జరిగిందని సామాజిక యాత్రలు చేయడం విడ్డూరమన్నారు.

కార్పొరేషన్ లు అన్నిటిని మూసివేసి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు దారుణమైన ద్రోహం చేసిన జగన్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని సామాజిక యాత్ర చేస్తుంది అని దుయ్య పట్టారు. రాష్ట్రంలో పురుషుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం జగన్ అన్నారు.డాక్టర్ సుధాకర్, కిరణ్ సుబ్రహ్మణ్యం, వంటి దళితులు చావుకి కారణం జగన్ ప్రభుత్వం అన్నారు. కామదేను లాంటి అమరావతిని ధ్వసం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రంలో ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల యువత ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. వాలంటీర్లు పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. సర్పంచుల హక్కులు కాల రాసి గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారన్నారు.

సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ
అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు మేలు చేయాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారన్నారు ఇందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేయడం జరుగుతుందని విల్సన్ అన్నారు. పాత్రికేయ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్,జిల్లా మీడియా ప్రతినిధులు శ్రీనివాస్, అరవపల్లి కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE