బీజెపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్‌

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ రోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నుండి పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply