-దాహం తీర్చండి
-తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్
రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు బుధవారం ట్వీట్ చేశారు. రాష్ట్రం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదు. మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేది. పంటలకు సాగునీరు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం…కనీసం ప్రజలు గొంతు తడుపుకోవడానికి తాగునీరైనా ఇవ్వాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.