రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.
ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయల ని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందనీ, మరియు రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు రావడం జరిగినందున ప్రజల వద్ద నుండి వచ్చిన స్పందన మరియు విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి మరో పదిహేను రోజుల పాటు అనగా తేది 15-04-2022 వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి తెలిపారు.
ఈ క్రింద విధముగా వివిధ రకాల వాహన యజమానులకు ఈ క్రింది విధముగా రాయితిని నిర్ణయించడం అయినది
• 2W/3W- కట్టండి 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ
• RTC డ్రైవర్స్ కట్టండి 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ,
• LMV/ HMV – కట్టండి 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫ్,
• తోపుడు బండ్ల వ్యాపారులు కట్టండి 2o%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ,
• నో మాస్క్ కేసులు- కట్టండి Rs 100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ,
బకాయిలు చెల్లింపు కోరిన మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లింపవచ్చు.
https://echallan.tspolice.gov.in/publicview/