Suryaa.co.in

Andhra Pradesh Political News

మూడు రాజధానుల ‘జగన్నా’టకంపై నిజాలివీ

– లంకా దినకర్, బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్

శాసనసభ లో న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది అంటూ.. అమరావతి మరియు మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశించి చేసిన దాడి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం తో ప్రారంభమై జగన్మోహనరెడ్డి జగన్నాటకం తో తారస్థాయికి చేరిందని బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే, ప్రతి విషయంలోనూ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మరియు విధి నిర్వహణ లోపాలు ఎత్తి చూపాలని ప్రయత్నం చేసి, కేవలం మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి వద్ద మోకరిల్లారు. ఆ వ్యాఖ్యలు “డీ కోడ్” చేస్తే స్పష్టం అవుతోంది.

“సద్గురు జగ్గి వాసుదేవ్” ని ఉటంకిస్తూ ధర్మాన వ్యాఖ్య :
Confidence without Clarity is Disaster – అంటే స్పష్టత లేకుండా పని చేయగలము అనే నమ్మకం ప్రతికూలమవుతుంది.
వాస్తవం :
151 మంది ప్రజాప్రతినిధులను గెలుచుకున్నందున ఏదైనా చేయగలము అనే ఆలోచనతో, అమరావతి రాజధాని పైన న్యాయ పరమైన అంశాలు, సహజసిద్ధమైన ధర్మానికి వ్యతిరేకంగా ప్రతికూల ఆలోచనలు చేయడం వల్ల జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అవసరం లేని ప్రాంతాల వారీగా విద్వేష విపత్తు ప్రజల నెత్తిన చుట్టే ప్రయత్నం జరుగుతోంది. చట్టాలు చేసే ముందు మంది బలం ఉందని స్పష్టత లేకుండా పని చేయగలము అనే జగన్మోహనరెడ్డి నమ్మకం, నేడు ప్రతికూల మవుతుంది.

గ్రీకు తత్వవేత్త “అరిస్టాటిల్” ని ఉటంకిస్తూ ధర్మాన వ్యాఖ్య :
Doctrine of Separtion of Power – అధికారల విభజన సిద్ధాంతం.
బ్రిటన్ తత్వవేత్త ” హాబ్స్ ” ని ఉటంకిస్తూ ధర్మాన వ్యాఖ్య :
అధికార విభజన – శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ ఒక్కరి చేతిలో ఉంటే అరాచకం, అణిచివేత అవుతుంది.
వాస్తవం :
రాజ్యాంగంలో అధికార విభజన స్పష్టంగా ఉంది కదా, అంటూ
శాసన వ్యవస్థ కి చట్టాలు చేసే హక్కు లేదా?, న్యాయ వ్యవస్థ నియంత్రణలో శాసన వ్యవస్థ కార్యనిర్వాహణ జరగాలా? అనే ప్రశ్నలు వేసే రాష్ట్ర మంత్రులు ఒక్కసారి రాజ్యాంగ నిపుణులను సంప్రదించాలి.

శాసన వ్యవస్థ చేసే చట్టాల ఎప్పుడు క్వాలిఫై కావో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ప్రాధమిక హక్కుల పైన కానిస్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్ చేసిన వ్యాఖ్యలు తెలుసుకుని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడితే మంచిది.

శాసన వ్యవస్థకి ప్రజ పాలన కోసం చట్టాలు చేసే హక్కు స్పష్టంగా ఉంది. శాసన వ్యవస్థకి రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే చట్టాలు చేసే అవకాశముంది.
ప్రజలకు షరతులు లేని ప్రాథమిక హక్కులను సంపూర్ణంగా రాజ్యాంగం ప్రసాదించింది. శాసన వ్యవస్థ చేసే చట్టాలు ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా చేస్తే చెల్లవు.
శాసన వ్యవస్థ చేసే చట్టాలను స్క్రూటినీ చేసి రాజ్యాంగ పరిధి అతిక్రమిస్తే, ఆ చట్టాలను అమలు కాకుండా నిలుపుదల చేసే అధికారం న్యాయ వ్యవస్థకి ఉంటుంది.

అమరావతి రాజధాని రైతుల కేస్:
1) మూడు రాజధానుల కోసం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల భూములు ఇచ్చిన రైతుల ప్రాధమిక హక్కుల భంగం కలిగింది. సీఆర్డీఏ చట్టం ద్వారా ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ రైతులకు హక్కులు, ప్రభుత్వానికి భాద్యతలు వచ్చాయి. ఆ అగ్రిమెంట్ కాల వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయిన మూడు రాజధానుల నిర్ణయం చెల్లదు.
2) రాజధాని అనే పదం రాజ్యాంగంలో కేవలం ఆర్టికల్ 239AAలో తప్పించి ఎ క్కడ వాడలేదు, ఆ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో రాజధాని గా కేంద్ర – రాష్ట్ర అధికార మరియు భాద్యతల కోసం పెట్టారు. దానిపై కోర్ట్ తీర్పులుకుడా ఉన్నాయి. సాధారణంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో సంభందిత షెడ్యూల్ లో పొందుపరచిన ” కేంద్ర జాబిత – రాష్ట్ర జాబిత – ఉమ్మడి జాబితా” లలో ఎక్కడ రాజధాని నిర్ణయం చెప్పలేదు.
కాబట్టి రాజధాని అంశం పై జాబితాలో లేనప్పుడు రాజ్యాంగ ప్రక్రియలో ఆ అంశాలు పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోవాలని ఉంది. అందువల్లనే, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని పై పార్లమెంట్ ద్వార చట్టం కాబడిన ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 మరియు సెక్షన్ 6 ద్వారా రాజధాని ఎంపిక మరియు నిర్మాణం పై విధులు విధానాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రాజధాని మార్పులు జరగాలన్న మరల పార్లమెంట్ ద్వారానే జరగాలి లేదా రాజ్యాంగ సవరణ చేసి మూడిట్లో ఏదొ ఒక జాబితాలో చేర్చాలి.
పైన తెలిపిన అంశాలే కాకుండా, కేంద్రం రాజధాని గా అమరావతి కి ఇచ్చిన నిధులు- ప్రాజెక్టు ద్వార స్టేక్ హోల్డర్స్ కూడా అయ్యింది. అలాగే, శాసన మండలి సెలెక్ట్ కమిటీ నిర్ణయం కూడా కీలకమే.
కాబట్టి, కేవలం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈగో సంతృప్తి పరిచే ప్రయత్నంలో మంత్రి పదవి పోకుండా కొందరు, మంత్రి పదవి కోసం కొందరు , పైన క్రింద పడ్డ వచ్చే ప్రయోజనం ఉండదు. కారణం, మీ ఆలోచన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని ఉటంకిస్తూ, ఉన్న రాజధానిని విచ్ఛిన్నం చేసి మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్ర పరిధిలో లేదు అని తెలిపింది. దీని పైన ఆక్షేపణ ఉంటే సుప్రీంకోర్టు లో అప్పీలు కి వెళ్ళే అధికారం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వదిలేసి న్యాయస్థానం పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం అంటే పాలనలో రాచరిక రాక్షస పోకడలు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

అరిస్టాటిల్, హాబ్స్ తెలిపిన విధంగా నేడు భారత దేశ రాజ్యాంగం ప్రకారం అధికార విభజన స్పష్టంగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ మధ్య కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో పేర్కొన్నారు. ఏ జాబితాలో లేని అంశంపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా ఉన్నప్పుడు ఇక సంశయం ఎందుకు? రాజ్యాంగ బద్ధమైన చట్టాల అమల్లో కార్యనిర్వాహక వ్యవస్థ భాద్యతలు స్పష్టంగా రాజ్యాంగం లో ఉన్నాయి. శాసన మరియు కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగ పరిధి పరిమితులు అతిక్రమించినప్పుడు న్యాయవ్యవస్థ చెక్స్ అండ్ బ్యాలన్స్ గా పని చేస్తున్న విషయం రాష్ట్రంలో పాలకులు మరిచారు.

“16 వ లూయీస్” వల్ల ఫ్రెంచ్ విప్లవం ని ఉటంకిస్తూ ధర్మాన వ్యాఖ్య :
16వ లూయీ రాచరికం నిర్ణయాల వల్ల మితిమీరిన అధికార కేంద్రీకృతం అయ్యి ప్రజల తిరుగుబాటుకి కారణం అయ్యింది.
వాస్తవం :
స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ప్రతీక ఫ్రెంచ్ విప్లవం అనే అంశం గుర్తు ఉంటే, నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యంని అపహాస్యం చేస్తూ, అమరావతి పేరుతో కులాల మాటున చిచ్చు రేపి “సమానత్వం” స్ఫూర్తిని తుంగలో తొక్కిన సంగతి ప్రజలందరికి తెలిసిందే. ముఖ్యంగా అమరావతి రైతుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన వారి రాజ్యాంగ పరిధి లోబడిన ” స్వేచ్ఛ ” కు ఈ రాష్ట్ర ప్రభుత్వం భంగం కలిగించ లేదా?

దాన్ని ప్రశ్నించిన మీడియాని, ప్రతిపక్షాల స్వేచ్ఛ ను కాలరాస్తే ఇదే న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పులు కనబడలేదా? న్యాయవ్యవస్థ పైన కేంద్ర ప్రభుత్వం గౌరవంగా వ్యవహరిస్తున్న తీరుకి మన రాష్ట్ర ప్రభుత్వం తీరుకి మధ్య తేడా సుస్పష్టం. కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ సమాజంలో విషబీజాలు నాటడం ” సౌభ్రాతృత్వం ” ఎలా అవుతుంది. నిరంకుశ రాజు వల్ల ఫ్రెంచ్ విప్లవం వస్తే, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉత్పన్నం అవుతున్నాయి.

ఫ్రెంచ్ తత్వవేత్త, న్యాయ కోవిదుడు ” మాంటేస్క్యూ ” ని ఉటంకిస్తూ ధర్మాన వ్యాఖ్య :
న్యాయ వ్యవస్థ కి పరిమితి ఉంది.
Judicial Activisam vs Judicial Restrain – పరిధిలు, న్యాయ వ్యవస్థ నిగ్రహం.
అందరి కన్న అతీతం అని న్యాయ వ్యవస్థ అనుకోకూడదు. మిగతా వ్యవస్థల విధులలో జోక్యం ఉండరాదు. సమాన హక్కులు మూడు వ్యవస్థలకు ఉన్నాయి.
వాస్తవం:
ప్రతి వ్యవస్థకి పరిమితులు ఉంటాయి, వాటికి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి, అవి రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటాయని మరచి, కేవలం పాలకులకు శ్రవణానందము కలిగించే బ్యాండ్ బాజా లాగ ఇతర వ్యవస్థలు నడవాలి అనుకోవడం అవివేకం. అయోధ్య రామాలయం నిర్మాణంలో కాని, మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కాని న్యాయవ్యవస్థ తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. కాని మెజారిటీ ఉందని కేంద్ర ప్రభుత్వం తప్పటడుగులు వేయకుండా సమన్వయం తో అడుగులు వస్తుంటే, రాజ్యాంగ భాద్యత మరచి హక్కుల పరిధి దాటి నేడు రాష్ట్ర ప్రభుత్వం తనకు సమాన హక్కులున్నాయి అనడం తెలివితక్కువ వాదన అవుతుంది.

రాజ్యాంగ పరిధి దాటి ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాస్తూ న్యాయ వ్యవస్థ నిగ్రహం పాటించాలని అనడం, వీరి దుర్మార్గులను చూసిచూడనట్లు వదిలేయాలని భావం వస్తున్నది. వ్యవస్థలకు సమాన హక్కులు ఉండవు, రాజ్యాంగం కల్పించిన హక్కులు రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే ఉంటాయి అని గుర్తించాలి. న్యాయవ్యవస్థ మిగతా వ్యవస్థలలో జోక్యం చేసుకోరాదు అనడం, మితిమీరిన రాజ్యాంగ ఉల్లంఘనల సైతం చూసి చూడనట్లు జగనన్న జిందాబాద్ అనమన్నట్లు ఉంది. ఏ వ్యవస్థ కి ఆ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో అతీతంగా మరియు మరి కొన్ని సందర్భాల్లో అతీతం కాకుండా దేశ హితము కోసం రాజ్యాంగంలో ప్రకరణల కూర్పు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేశారు.

“Tata Cellular vs Union of India” కేసు ని ఉటంకిస్తూ ధర్మాన వ్యాఖ్య :
కోర్టులు ఎగ్జిక్యూటివ్ ని అనవసరంగా ఇబ్బంది కలిగించరాదు.
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి వ్యాఖ్యల ప్రకారం, “I am not expert of Accountant, Engineer etc., Hence, I should not act like adement head master” ( నేను అనుభవం ఉన్న అకౌంటెంట్, ఇంజనీర్ కాదు. కాబట్టి, నేను కఠినమైన ప్రధాన ఉపాధ్యాయునిగా వ్యవహరించకూడదు )
కార్యనిర్వాహక వ్యవస్థ ఆ ప్రత్యేకికరణ కూడిన సమాచారాన్ని న్యాయ వ్యవస్థకి పంపుతుంది అని ధర్మాన అన్నారు.

ఒక కొట్ చేస్తూ ధర్మాన .. జస్టిస్ వర్మ: లెజిస్లేషన్ చేసే హక్కు చట్ట సభలకు మాత్రమే ఉంది, కోర్ట్ ప్రాధమిక హక్కులు చట్టంలో ఇబ్బంది అయితే, కోర్టులు కేవలం చెప్పాలి కానీ …కోర్టు ప్రభుత్వం నడప లేదు. లేని అధికారం కోర్ట్ సృష్టించుకోలేదు.
వాస్తవం :
న్యాయ వ్యవస్థ వివిధ రంగాల్లో నిష్ణాతుల సేవలు అవసరం అయినప్పుడు వాడుకొనే తీర్పు ఇస్తుంది, అలాగే ఇతర వ్యవస్థలు కూడా అదే పరిమితి లో పని చేస్తాయి. మూర్ఖత్వంతో రాజ్యాంగ స్ఫూర్తికి పాలకులు చేసే చట్టం వల్ల విఘాతం కలిగినప్పుడు, దాన్ని సరి చేసే భాద్యత న్యాయ వ్యవస్థ కి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు.

చెత్త మీద పన్ను చెత్త నిర్ణయం అయినా న్యాయ వ్యవస్థ ప్రభుత్వన్ని కాదు అన్నదా?, మద్యం షాపుల వద్ద పనికిమాలిన పనికి అధ్యాపకుల సేవలు వినియోగించుకోవాలనే ప్రభుత్వం అనుకుంటే ఆ విధులు న్యాయ వ్యవస్థ ఆపివేసిందా?, మరుగుదొడ్లు దగ్గర విధులు వార్డు, గ్రామ వాలంటీర్లు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే న్యాయవ్యవస్థ ఆపివేసిందా? ప్రభుత్వం కోర్ట్లు నడిపి ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిందా? ధర్మాన సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

రాష్ట్రంలో శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అదుపు తప్పి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సందర్భాల్లో బాధితుల హక్కుల రక్షణ కోసం న్యాయ వ్యవస్థ తలుపులు తెరుచుకున్నాయి.
అధికారం లేని అంశాలపై చట్టాలు చేసి చేతులు కాల్చుకొని ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన అక్కసు వెళ్లగక్కితే లాభం ఏంటీ ? నేడు రాజధాని ఏర్పాటు పర్యవసానలు నేడు కోర్ట్ పరిధిలోకి వెళ్లిపోయాక, కోర్ట్ నిర్ణయం మాత్రమే శిరోధార్యం. ఇబ్బంది ఉంటే పై కోర్ట్ కి అపిల్ వెళ్లే హక్కు ఉన్నా కూడా శాసనసభ లో ఇలాంటి చర్చ చేయడం ద్వారా పాలకులు ప్రజలలో చులకన అయ్యారు.

AP హై కోర్ట్ తీరు భాద అనిపించింది. ఇది ఓటు హక్కు ద్వారా పెద్ద ఆధిక్యం తో వచ్చిన ప్రభుత్వం అని ధర్మాన వ్యాఖ్యానించారు
Change of Government is not means the Change of policy ( ప్రభుత్వం మార్పు అంటే ప్రభుత్వ పాలసీ మార్పు కాదు) అన్న హై కోర్ట్ వ్యాఖ్యాలు సమంజసం కాదు అని ధర్మాన అన్నారు.
శాసనసభ అధికారల సంగతి ఏంటీ ? ప్రభుత్వం మారితే పాలసీ మారదు అంటే ఇక ప్రభుత్వ మార్పు ఎందుకు? ప్రభుత్వం కొత్త వారికి అవకాశాన్ని ఇచ్చారు అంటే పాత ప్రభుత్వం ప్రజలు మార్చమనే కదా? ఇక మ్యానిఫెస్టో ఎందుకు, ఎన్నిక లెందుకు? వివిధ ప్రభుత్వలు తీసుకున్న నిర్ణయాలు తరువాత ప్రభుత్వాలు మార్చాయి.
పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది – కానీ హై కోర్టు పారిశ్రామిక విధానాన్ని మార్చారు కూడదు అన్నారు…. ప్రాధమిక హక్కులు భంగం కలగకుండా ఉన్నప్పుడు మార్చవచ్చు.
వాస్తవం :
ఎవరైన వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే భాద ఉండి తీరుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాల వల్ల కోట్లాది మంది ప్రజలు పడుతున్న భాద విషయం పరిస్థితి ఏంటి?, అమరావతి లో రైతులు మరియు మహిళా ప్రాధమిక హక్కులు పైన దాడుల పైన సమాధానం ఇవ్వగలరా?, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిరుపయోగంగా వృథా చేస్తుంది ఆపాలా, వద్దా?, పాలకులు ప్రజాధనానికి ట్రస్టీలు మాత్రమే కాని యజమానులు కాదు.

ప్రభుత్వం ఏర్పాటు రాజ్యాంగ పరిమితికి లోబడి మాత్రమే ఉంటుంది కానీ, పెద్ద మెజారిటీ లేదా చిన్న మెజారిటీ పైన ఆధారపడి ఉండదు అనే పరిజ్ఞానం లేని చర్చని ఏం అనాలి? పెద్ద మెజారిటీ అంటే ప్రజలు పెట్టిన పెద్ద భాద్యత అని ప్రభుత్వం భావించి పాలకులు పాలన చెయ్యాలి. కాని లేని హక్కులు స్వయంగా సృష్టించుకుంటే, ఇలా న్యాయస్థానంలో అభాసుపాలు కాక తప్పదు.

రాజ్యాంగంకు, చట్టాలకు ముడిపడిన అంశాలలో గత పాలకుల నిర్ణయాలు తూ.చ తప్పకుండా ప్రస్తుత పాలకులు పాటించి తీరవలసినదే, ఇటువంటి అంశాలలో గత చట్టాలు మరియు అగ్రిమెంట్లు గతం కన్నా మెరుగైన రీతిలో ఇప్పుడు అమలు చేస్తే ఎవరు ఆక్షేపించరు. సమస్య వాటిని “రివర్స్” చేయాలని అనుకుంటే, బాధితులు న్యాయస్థానం తలుపులు తడితే, వారికి రాజ్యాంగ మరియు చట్టపరమైన హక్కులు కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థది మాత్రమే.

గత ప్రభుత్వం పాలసీలు మార్చడం, కొత్త చట్టాలు చేయడం, కొత్త విధానాలు తేవడం కొత్త ప్రభుత్వం చేయడాన్ని ఎవరు ప్రశ్నించ లేరు – కానీ ఆ మార్పులు వల్ల ప్రస్తుత విధానంకి అనుసంధానం కావాల్సిన అంశాలు పక్కకు నెట్టి, ఉత్తర దృవంని దక్షిణ దృవంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రయత్నాలు చెల్లవు. 30 సంవత్సరాల క్రితం నాటి ప్రధాని పీ వీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలను నేటికి మనం ఆచరిస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి.

ఇక మ్యానిఫెస్టో ఎందుకు, ఎ న్నిక లెందుకు? అనే ముందు, మద్యం నిషేధం హామీ మీ మ్యానిఫెస్టో లో ఉంది, కానీ మద్యం ఆదాయం లేనిదే ప్రభుత్వం నడపడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శాసనసభ లో చెప్పారు. అలాగే మూడు రాజధానుల ఏర్పాటు తో అమరావతి నిర్వీర్యం చేస్తామని మీ మ్యానిఫెస్టో లో లేదు, కానీ మీ ప్రణాళిక ఇప్పుడు రివర్స్ లో ఉంది.మంచి ప్రసంగం చేసి, చెప్పడానికి మాత్రమే నీతులు అన్నట్టు ధర్మాన ప్రసాదరావు గారు చివరికి తుస్సుమనిపించారు.

అనేక వాస్తవాలు వేరే సందర్భాల్లో అవసరమైన అంశాలు తెలివిగా అసందర్భంగా అసెంబ్లీ లో మాట్లాడారు కాబట్టి, అయిన వక్రీకరించిన అంశాలపైన వాస్తవాలు వెలుగులోకి తేవలసిన భాద్యత ఉందని భావించి ఈ ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నాను.

LEAVE A RESPONSE