Suryaa.co.in

Andhra Pradesh

నేడు 175 నియోజకవర్గాల్లో రైతు సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలు

– రైతాంగం సాధించిన విజయానికి మద్దతుగా  సజ్జల రామకృష్ణారెడ్డి
మహాత్మాగాంధీ స్పూర్తిని, శక్తిని ప్రతిబింబింపజేసేలా… భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని సాధించిన రైతాంగానికి మద్ధతుగా… ఈరోజు(నవంబరు 20) సాయంత్రం రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీలు నిర్వహించవలసిందిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. అన్నదాతల ఆకాంక్షలు ఫలించి సాగు చట్టాలు రద్దు కావడం శుభపరిణామం. ఫలితంగా రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయనీ… దేశంలో రైతే రాజు అన్నది మరోమారు నిరూపితమైందని… భావిస్తున్నామని అన్నారు. సాగు చట్టాల రద్దుకై రాష్ట్రంలో జరిగిన బంద్‌లకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

LEAVE A RESPONSE