Suryaa.co.in

Editorial

ఫరూఖ్ ఫస్ట్.. సుభాష్ లాస్ట్!

  • చంద్రబాబుకు ఆరో స్థానం

  • 7,8 స్థానాల్లో సత్యకుమార్, లోకేష్

  • 9,10 స్థానాల్లో బీసీ, పవన్

  • 23,24 స్థానాల్లో కొలసు, కేశవ్

  • ఫైళ్ల క్లియరెన్సులో సీఎం మార్కులు

  • ఇంత స్లోగా ఉంటే కుదరదు

  • ఇక పరుగులు పెట్టాల్సిందే

  • మీ పనితీరుపై ఫోకస్ పెడతా

  • మంత్రులకు బాబు క్లాసు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఫైళ్ల క్లియరెన్సులో మంత్రులు పెద్దగా ఉత్సాహం చూపటం లేదని ముఖ్యమంత్రి ఆ అంశంలో వారికి ఇచ్చిన మార్కులు స్పష్టం చేసింది. మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన.. మంత్రుల ఫైళ్ల క్లియరెన్సకు సంబంధించి స్ధానాలు, మార్కులు ఇచ్చారు. ఆ ప్రకారంగా మైనారిటీ శాఖ మంత్రి ఫరూఖ్ తొలి స్థానంలో ఉండగా, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రుల పనితీరులో తొలిస్థానం సాధించిన సుభాష్.. ఫైళ్ల క్లియరెన్సులో మాత్రం అందరికంటే చిట్టచివరి స్ధానం సాధించడం గమనార్హం.

ఇక స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు తనకు ఆరు మార్కులు ఇచ్చుకోగా. సత్యకుమార్‌యాదవ్, లోకేష్‌కు 7,8 స్థానాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు 10వ స్థానం దక్కింది.

ఫ్లైళ్ల క్లియరెన్సులో ఎవరెక్కడ?

ఒకటవ స్థానంలో ఫరూఖ్, 2వ స్థానంలో కందుల దుర్గేశ్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ 4, డోలా బాలవీరాంజనేయస్వామి 5, సత్యకుమార్ 7, బీసీ జనార్దన్ రెడ్డి 9, సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13, నారాయణ, 14 టీజీ భరత్ 15, ఆనం రామనారాయణరెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మిడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24, సుభాష్ 25వ స్థానంలో నిలిచారు.

ఇంత స్లో అయితే ఎలా?

కాగా మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించడం వల్ల ఈ 6 నెలలు మీ పనితీరుపై ఫోకస్ చేయలేదన్నారు. ఇకపై మీ పనితీరుపై ఫోకస్ పెడతానన్నారు. ‘ఈ ఆరునెలలలో కూడా మీ పనితీరు మెరుగుపరచుకోలేకపోతే ఎలా? ఇంత స్లోగా ఉంటే కుదర దు. నిదానంగా ఉంటే నడవదు. పరుగులు తీయాల్సిందే’’నని బాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE