Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి అరాచకాలు, దోపిడీలపై పెద్ద ఎత్తున పోరాటం

నియోజకవర్గాల వారీగా సర్వసభ్య సమావేశాలు
భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమం విజయవంతం
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశంలో తీర్మానం

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి పోలీట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు హాజరయ్యారు.

ఓటర్ల జాబితా పరిశీలన, భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహణ, నియోజకవర్గాల వారీగా సర్వసభ్య సమావేశాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు వాటి పై చేపట్టవలసిన ఆందోళన కార్యక్రమాలు, తదితర అంశాలు అజెండాగా సమావేశం సాగింది..

ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక ఓటర్ వెరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహించాలని దొంగ ఓట్లకు తావు లేకుండా చూడాలని, నవంబర్ ఒకటో తేదీ నుంచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని, నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు దోపిడీలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు….

సమావేశంలో వెంకటగిరి, సూళ్లూరుపేట, కావలి నియోజకవర్గాల ఇన్చార్జ్లు కురుగొండ్ల రామకృష్ణ, నెలవెల సుబ్రహ్మణ్యం, మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ శాసనసభ్యులు పరసా వెంకటరత్నయ్య, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పాల్గొన్నారు

LEAVE A RESPONSE