Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరుబాట

– ఏపీ జేఏసీ అమరావతి నాయకులు

విజయవాడ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసనలు కొనసాగుతాయని, రాష్ట్రంలో రెండో దశ పోరాటం మొదలైందని సభ్యులు తెలిపారు. రెండో దశ పోరాటంలో భాగంగా 18, 25, 29 తేదీల్లో తమ డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

నెల్లూరులో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పోరాటానికి సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. చిత్తశుద్ధితో పోరాటాన్ని నడిపిస్తూ, ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

తిరుపతి, చిత్తూరు కార్యక్రమాలను తాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై పోరాట కార్యాచరణ కోసం 8 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ట్రేడ్ యూనియన్ల మద్దతు కోరామని, ఏఐటీయూసీ మద్దతు ప్రకటించిందని తెలిపారు.

LEAVE A RESPONSE