-ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి.. ప్రశ్నించిన టీడీపీ నేతలపై పెద్దఎత్తున అక్రమ కేసులు నమోదు దుర్మార్గం
– తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి -అచ్చెన్నాయుడు
సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి… వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిపక్ష టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, వెంకట శివరామరాజు, పత్తిపాటి పుల్లారావుతో పాటు మరో 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ మొదట నిర్ణయించిన రూ.240 నుంచి తమ లూటీ కోసం రూ.210కి కుదించడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం. ఆక్వా రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేసిన టీడీపీ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం. చంద్రబాబు గారి హయాంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్న ఆక్వారంగం నేడు జగన్ రెడ్డి పాలనలో పతనావస్థకు చేరింది. మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జే ట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని అణచివేయాలనే మీ కుట్రలు సాగబోవని హెచ్చరిస్తున్నాం.