పిచ్చోళ్లారా.. నిజాలు తెలుసుకోండి!

– కరోనా మాయ లో మునిగి తేలుతుంటే, లోకం మారి పోతోంది
– కొత్త ప్రపంచం మీ ముందుకు వచ్చేసింది. మీరేమో ఇంకా పాత లోకం లో ఉన్నారు
– అన్ని మార్పులు మంచివి కావు
” కరోనా కాటేసింది ! ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు . నిరుద్యోగిత పెరిగింది . డిగ్రీ చేసిన వారు పొట్ట కూటి కోసం కూరగాయలు , పళ్ళు అమ్ముకొనే హాకర్ లుగా మారారు . కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి “… ఇవి కదా మీరు చదువుతున్నది .. వింటున్నది .
వీటిలో నిజం వుంది . కానీ మీ కంటికి కనిపించని మరో కోణం వుంది . దీన్ని గురించి ఇప్పుడే ఎవరూ మాట్లాడరు. తెలుసుకోవాలనుకొంటున్నారా ? అయితే చదవండి .
1 . సాఫ్ట్వేర్ కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బుడిగా పెరిగిపోయాయి . సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతాలు బాగా పెరిగాయి . పెద్ద ఎత్తున కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి రిక్రూట్ చేసుకొంటున్నాయి .
2 . ఫార్మా యజమానులు ఇంకా వైద్య రంగంలోని అనేక మంది ఆస్తులు, ఊహాతీతంగా పెరిగిపోయాయి .
పండెమిక్ సమయం లో మెడికల్ రంగం లాభపడడం సహజం .. ఇందులో ఏముంది అనుకొంటున్నారా ? అప్పుడే కథ ముగిసి పోలేదు . చదవండి .
3 . గత ఎనిమిది నెలల్లో సెన్సెక్స్ యాభై వేలనుంచి అరవై వేలకు పెరిగింది . ఇప్పుడు అది అరవై వేలకు దాటి పెరుగుతోంది . సెన్సెక్స్ అంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్. ఓవర్ అల్ గా బిజినెస్ ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సూచిక . ఒక పక్క అంతా దివాళా తీస్తుంటే సెన్సెక్స్ ఇలా ఆకాశాన్ని అంటడం ఏంటి ? ఆలోచించారా ? సెన్సెక్స్ పెరిగితే దేశానికీ మంచిదే కదా .. ఇందులో బాధ పడడానికి ఏముంది అంటున్నారా ? బాధ పడమని నేను చెప్పడం లేదు . అసలు మీకు ఏమి జరుగుతుందో తెలుస్తుందా ? అని అడుగుతున్నా .
చుట్టూరా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే వాస్తవాన్ని గ్రహించాలి అంటే చివరి దాక చదవండి .
4 . తాజ్ హోటల్స్ గురించి విన్నారా ? ఉదారణకు హైదరాబాద్ లో తాజ్ వివంటా, తాజ్ డెక్కన్ , తాజ్ కృష్ణ . ఇంకా గేట్వే హోటల్స్ గురించి విన్నారా ? ఇంకా MAHINDRA HOLIDAYS , LEMON TREE హోటల్స్ , కామత్ హోటల్స్ , VICEROY హోటల్స్ ..ఇలా అనేక సంవత్సరాలుగా ఇండియా లో పెద్ద పెద్ద హోటల్స్ నడుపుతూ.. పెద్ద ఆస్తులు కూడబెట్టిన 20 హోటల్స్ కంపెనీల మొత్తం విలువ 43 వేల కోట్లు . JUBILIANT ఫుడ్ వర్క్స్ .. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? వినివుండరు . ఎందుకంటే వారికీ ఏమీ హోటల్స్ లేవు . డున్కిన్ దోనుట్స్ , డొమినోస్ పిజ్జా ఈ రెండు కంపెనీ లకు ఇండియా లో, ఇంకా నేపాల్ శ్రీలంక లో వీరికే ఫ్రాంచైజ్ వుంది . ఈ కంపెనీ విలువ ఎంతో తెలుసా ? నలభై వేల కోట్లు . అనేక ఏళ్లుగా హోటల్స్ బిజినెస్ చేస్తూ ఎన్నో ఆస్తులను కలిగిన ఇరవై హోటల్స్ తో సమానంగా, వీరి కంపెనీ విలువ వుంది . అంతే నా ? కథ అప్పుడే అయిపోలేదు .
5 . ప్రపంచం లో ఎక్కడా ఒక్క హోటల్ లేదు .. కనీసం ఒక్క స్పూన్ కూడా వీరు కొనలేదు . ఒక చదరపు అడుగు ఆస్థి వీరి సొంతం కాదు . కానీ జొమాటో మార్కెట్ వేల్యూ ఎంతో తెలుసా ? అరవై వేల కోట్లు . ఈ ప్రపంచం మీకు అర్థం అవుతోందా ? మీ చుట్టూరా ఏమి జరుగుతుందో కనీసం తెలుసుకొనే ప్రయత్నం చేశారా ? లేక నోటికే కాక కళ్ళకు కూడా గంతలు కట్టుకొన్నారా ?
ఈ సమాజం లో బతకాలి అంటే ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవాలి . మంచి చెడు సంగతి తరువాత . అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోక పొతే , మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోకపోతే, డైనోసార్లు లాగా అంతరించి పోయే ప్రమాదం వుంది . స్టే హోమ్ .. స్టే సేఫ్ .. కరోనా అంతరించి పోతుంది .. అప్పటిదాకా మాస్క్ వేసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది . బతికుంటే బలసాకు తినొచ్చు అని మీరు అనుకొంటున్నారు . మీకు బలుసాకు అయినా మిగులుతుందో లేదో తెలియదు కానీ .. మీ చుట్టూరా జరుగుతున్న మరి కొన్ని విషయాలు .
దేశవ్యాప్తంగా హై ఎండ్ హోసింగ్ కు విపరీతంగా డిమాండ్ పెరిగింది . మీరు సిటీ లో ఫ్లాట్ లో ఉంటున్నారా ? మీ ఫ్లాట్ సైజు ఎంత ? రెండు వేల చదరపు అడుగులు .. అవునా ? అంత కంటే తక్కువా ? సరే .. పెద్ద ఫ్లాట్ అంటే ఎంత సైజు ఉంటుందో ఊహించండి . నాలుగు వేలు ? పోనీ ఆరు వేలు … వామ్మో ఒక్క ఫ్లాట్ ఆరు వేలు అనుకొంటున్నారా ? అయితే హైదరాబాద్ లో ఇటీవలే ఒక అపార్ట్మెంట్ వెలిసింది . ఇందులో ఒక్కో ఫ్లాట్ సైజు ఎంతో తెలుసా ? గుండె లు బిగ పట్టుకోండి . ఒక్కటో ఫ్లాట్ సైజు .. పదిహేడు వేల చదరపు అడుగులు . ఒక్కో ఫ్లాట్ విలువ ఇరవై అయిదు కోట్లు . ఎవరు కొంటారులే అనుకొంటున్నారా ? హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి .
హైదరాబాద్ లో కొన్ని గోల్డ్ షాప్ ల లో జనాల రద్దీ విపరీతంగా ఉంటోంది . కిలోలో కొద్దీ గోల్డ్ అమ్ముడు పోతోంది . మరో పక్క రోజూ రకరకాల పద్ధతుల్లో, కిలోల బంగారం విదేశాల నుంచి స్మగ్లింగ్ అవుతోంది . ఇంతకు అనేక రెట్ల విలువ ఉన్న మాదక ద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి . మొన్న దొరికిన మాదక ద్రవ్యాలు విలువ వేల కోట్లు . ఇంతకు మించి అనేక రెట్ల మాదక ద్రవ్యాలు అనేక సంవత్సరాలుగా దేశానికి వస్తూనే వున్నాయి . పంజాబ్ లో అయితే ఇది ఒక కుటీర పరిశ్రమ అయ్యింది . తాలిబన్ ల కు రెవిన్యూ ఎక్కడినుచి వచ్చిందని అనుకొంటున్నారు ? ఇప్పుడు తాలిబన్ ల పాలన. ఆ దేశానికి ఆదాయం లేదు . ఇక చూస్కోండి . మనకు రాజకీయాలే వచ్చు . ఆ పార్టీ ఈ పార్టీ .. ఈ నాయకుడు .. ఆ నాయకుడు అని కొట్లాడడమే వచ్చు . వాస్తవాలు అక్కర లేదు .
సన్నీ లియోన్ .. ఈ పేరు వినే వుంటారు . ఇండియన్ పోర్న్ స్టార్ . కరోనా ముందు కాలంలో అయిదుగురో అరుగురో ఇండియన్ పోర్న్ స్టార్ లు ఉండేవారు . ఇండియన్ యువతులు దుబాయ్ లాంటి చోట్ల, డాన్స్ బార్ లలో అర్ధ నగ్న నృత్యాలు చేసేవారు . ఇప్పుడు కనీసం నలబై మంది ఇండియన్ పోర్న్ స్టార్ లు వున్నారు . ఇంకా పేరు సంపాదించని వారి సంఖ్య వందల్లో వుంది .
రోజుకు కనీసం డజను పోర్న్ ఫిలిమ్స్ నిర్మాణం అవుతున్నాయి . నేను చెబుతున్నది వెబ్ సిరీస్ గురించి కాదు . అది వేరే కథ . నేను చెప్పింది పూర్తి స్థాయి పోర్న్ ఫిలిమ్స్ గురించి . ఒకప్పుడైతే ఎక్కడో అడవిలో సెక్స్ వర్కర్స్ తో ఇలాంటివి తీసేవారు . ఇప్పుడు మోడల్స్ , కాలేజీ బాయ్స్ , గర్ల్స్ వందల సంఖ్య లో పోర్న్ industry లో అడుగుపెడుతున్నారు . ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదొక ఇండస్ట్రీ గా మారింది, డబ్బు పేరు విలాస జీవనం కోసం ఈ రంగం లోకి వస్తున్నారు .
నేను పైన చెప్పిన వాటిలో మంచి చెడు.. ఇలా జరగడానికి గల కారణాలు .. ఈ చర్చ తరువాత, . అసలు ఏమి జరుగుతుందో తెలిస్తే కదా చర్చ మొదలు కావడానికి . మీరందరూ కరోనా మాయ లో మునిగి తేలుతుంటే, లోకం మారి పోతోంది . కొంత మంది బిలియన్ ల ఆస్థి కూడ పెట్టేస్తున్నారు . వ్యవస్థలను- మీడియా ను లొంగ తీసుకొంటున్నారు . వీరి ప్లాన్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి .

ఆలోచించండి . వాస్తవాలు తెలుసుకోండి

మొన్నటి దాక .. ఆ మాట కొస్తే ఇప్పటిదాకా, మీలో చాలా మంది ఏమనుకొంటున్నారు ? కరోనా వైరస్ పోతుంది అని కదా . flaten ది కర్వ్ .. కరోనా ను తరిమి కొట్టండి అని చెప్పుకొన్నారు కదా . 1918 స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మన మధ్యే ఉంది అని మీకు తెలియక పోవచ్చు . మనల్ని పరిపాలించే నాయకులకు కూడా, ఇంత డీప్ సైన్స్ తెలిసే అవకాశం లేదు . చెప్పాల్సింది ఎవరు ? మెడికల్ రంగం లో ఉన్న మేధావులకు వైరస్ ఒక్క సారి వస్తే మళ్ళీ పోదని .. ముఖ్యంగా ఇంత పండెమిక్ కు కారణం అయిన వైరస్ పోదని తెలియదా ? ఒకరైనా నిజం చెప్పారా ? వైరస్ కు భయపడకండి . ఇమ్మ్యూనిటి పెంచుకోండి . హెర్డ్ ఇమ్యూనిటీ ఒక్కటే మార్గం ..
లాక్ డౌన్ పెట్టేలా ప్రభుత్వాల పై ఒత్తిడి .. అవసరం అయితే కోర్ట్ ల దాక వెళ్లడం .. ప్రచారం .. ప్రభుత్వాలకు ఇష్టం లేకున్నా బలవంతంగా లాక్ డౌన్ .. ఇవన్నీ ప్రజారోగ్యం కోసం జరిగాయి అని మీరు అనుకొంటున్నారు . మీరు ఆ మాయ నుంచి ఇంకా బయటకు రాలేదు . కొత్త ప్రపంచం మీ ముందుకు వచ్చేసింది . కొత్త కొత్త వ్యాపారాలు .. మీరేమో ఇంకా పాత లోకంలో వున్నారు . నిద్ర లేవండి . లేకపోతె మీ పిల్లలు డ్రగ్స్ సరఫరా చేసేవారు గానో, కూరగాయలు అమ్మే వారు గానో .. ఇలా చెబుతున్నందుకు సారీ పోర్న్ ఫిలింలో నటించే వారు గానో మిగిలి పోయే ప్రమాదం వుంది .
ఇప్పటికైనా నిద్ర లేవండి . ఏమి జరుగుతుందో తెలుసుకోండి . మార్పు అనివార్యం .. అన్ని మార్పులు మంచివి కావు . స్టాక్ మార్కెట్ పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటే సంతోషమే . ఇండియా ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచానికి ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోంది . ఇది తియ్యటి వార్త . కానీ అదే సమయం లో ధనవంతులు మరింత సంపద కూడ పెడుతున్నారు . మధ్య తరగతి నాశనం అయిపోతోంది . కొత్త మార్పులను స్వీకరించలేని బలహీనత ఇందుక ఒక కారణం . జరుగుతున్న మార్పులను గ్రహించలేని అమాయకత్వం ఎక్కువమందిది .
అన్ని మార్పులు మంచివి కావు . పోర్న్ , మాదక ద్రవ్యాలు కుటీర పరిశ్రమలుగా ఎదిగే ప్రమాదం కనిపిస్తోంది . ఢిల్లీ , ముంబై , బెంగళూరు నగరాల్లో ఇప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది .
నిద్ర లేవండి . తెలుసుకోండి . ఆరోగ్యకరమైన చర్చ ను మొదలెట్టండి . మంచి చెడు తరువాత.. ప్రపంచ చరిత్రను రెండుగా విభజించవచ్చు . కరోనా పూర్వ యుగం .. కరోనా అనంతర యుగం . ఈ యుగంలో మీరు విలుప్త జీవులుగా మిగిలి పొతే మీ వారసులు మిమ్మల్ని క్షమించరు . లేవండి .

– పివిఆర్ భానుప్రసాద్ రాజు

Leave a Reply