ఢిల్లీలో అగ్ని ప్రమాదం

పండగ వేళ దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో 34 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా పొగ వ్యాపించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణమేమిటో ఇంకా తెలియలేదు.

Leave a Reply