కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఈమెకే

తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది. ఈ నేపథ్యంలో తొలి ఉద్యోగం హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే అమ్మాయికి ఇవ్వనున్నారు. గతంలో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబ్ గ్యారంటీలో భాగంగా.. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆమెకు జాబ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ఆహ్వానం అందించారు. ఆమెకు రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం రేపు ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply