ప్రతి ఆదివారం ఉచిత రక్త, క్రియటిన్ పరీక్షలు

– కన్నా నిర్వహణలో పేదలకు ఉచితంగా రక్త పరీక్షలు.

సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సూచన మేరకు సత్తెనపల్లి మునిసిపల్ పరిధిలో గత నాలుగు వారాల నుంచి రక్త పరీక్షలు, క్రియటిన్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. 15,16 వార్డులలో వడ్డవల్లి ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగింస్తూ, ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ మునిసిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి , రాష్ట్ర పార్టీ కార్యదర్శి చౌట శ్రీనివాసరావు ,నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply