మనం ఇళ్లు కడితే జగన్ రంగులేసుకుంటాడు.. మనం ప్రాజెక్టులు కడితే తన పేరు రాసుకుంటాడు

-సైకో సర్కారుకు గద్దెదించాల్సిన బాధ్యత ప్రజలదే
-జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధం
-మహిళలకు చాక్లెట్ ఇచ్చి నక్లెస్ కొట్టేస్తున్న జగన్ సర్కారు
-జగన్‌ను ఇంటికి పంపే సమయం వచ్చేసింది
-టీడీపీ-జనసేనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే
-జగన్ సర్కారుపై మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ ఫైర్
-పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో కుందూరి వారి పాలెం,గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా
-అట్టహాసంగా భారీ ర్యాలీతో బాణసంచాతో స్వాగతం పలికిన గ్రామస్తులు
-ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
– నకరికల్లు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ
– గుండ్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కరాలపాటి వలిని పరామర్శించిన కన్నా
– కొత్తపాలెం గ్రామంలో శ్రీశ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న కన్నా

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజలు చేసి అనంతరం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి , నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలు హారతులతో ఘన స్వాగతంపలికారు . కన్నా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి, ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు.

కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పన్నుల బాదుడుతో రాష్ట్ర ప్రజల రక్తం పీల్చుతూ కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా అనే మాయగాడు జగన్ అని.. మనం గృహాలు కడితే అతను రంగులు వేసుకుంటాడని.. మనం ప్రాజెక్టులు కడితే అతని పేరు రాసుకుంటాడని నిప్పులు చెరిగారు. అసలు విశ్వసనీయత నాతో పుట్టింది అని చెప్పుకొచ్చాడని.. మాట తప్పను మడమ తిప్పడం తెలియదన్నాడు. కానీ ఇచ్చిన మాటలన్నీ గాలికి వదిలేసాడని, జగన్ పని అయిపోయిందని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

నా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో రాజకీయం అంటే.. అధికారం చెలాయించడం కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడం అని. కానీ ఈ సైకో జగన్ కు ఉత్తరాంధ్రను ఎలాంటి అభివృద్ధి లేకుండా చేశాడు . జనం తిరుగుబాటు తుఫానులో వైసీపీ కొట్టుకుపోతుందని స్పష్టం చేశారు.

Leave a Reply