మెడికల్ కాలేజీలను పూర్తి చేయటానికి నిధులు కొరత ఉంటే దానికి పరిష్కారం 3Ps మోడల్ కాదు . 4Ps/P4 మోడల్ కి షిఫ్ట్ కండి . దేశ విదేశాలలో సెటిల్ అయిన ఎంతో మంది తెలుగు వారు , కోటీశ్వరులు , దాతృత్వం కలవారు ఉన్నారు . ఉదాహరణకు మా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి NATCO , పొదిలె ప్రసాద్ గారు కోట్లు కోట్లు ఇచ్చారు . ఇలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు .
పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ , రామకృష్ణ మిషన్ , దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ వంటివి ఎన్నో హాస్పిటల్సుని నిర్వహిస్తూ ఉన్నాయి . చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు ఇస్తే ఫార్మా కంపెనీలు , దయగల హృదయులు P4 పథకం కింద విరాళాలు ఇచ్చేస్తారు .
హాస్పిటల్ పేరుకు యాభై కోట్లు , కాలేజీ పేరుకు యాభై కోట్లు , వార్డు పేరుకి పది కోట్లు . ఇలా ఎక్కడెక్కడ పేర్లు పెట్టేందుకు అవకాశం ఉంటే అక్కడ విరాళాలను అడగండి . ఈ వివాదానికి తెర దించండి. రాజధానుల విషయంలో జగన్ చేసిన తప్పును మీరు చేయకండి .
ప్రైవేటు రంగంలో కావాలనుకుంటే ఓ యాభై కాలేజీలకు అనుమతి ఇచ్చుకోండి . అలాగే PPP లో కూడా ఇచ్చుకోండి. కానీ , ప్రభుత్వ రంగంలో ప్రారంభించటానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .
దానిని ఇప్పుడు మోడల్ మార్చటం అంటే సింగిల్ రాజధానిని మూడు రాజధానులుగా మార్చటం లాంటిదే . దయచేసి ఈ ఆలోచనను ఉపసంహరించుకోండి . 3Ps మోడల్ నుండి 4Ps మోడలికి షిఫ్ట్ కండి మరీ తప్పకపోతే!
– ప్రొఫెసర్ దోగిపర్తి సుబ్రమణ్యం
(ఫౌండర్ అండ్ చైర్మన్)
నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం
గుంటూరు