ప్రజల సొమ్ము కాజేసిన గజదొంగ చంద్రబాబు

ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, నవంబర్ 14: గజదొంగ చంద్రబాబు తన హయాంలో 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు 1400 కోట్లు లంచం పుచ్చుకొని ‘చంద్రం కానుకగా 2016-18 లో గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, లెజెండ్ లాంటి 115 చీప్ లిక్కర్ బ్రాండ్లకి పర్మిషన్లు ఇచ్చాడని,  40 వేల బెల్టు షాపులు నడిపించిన రాక్షస చరిత్ర అతనిదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు. తిరుపతి రైల్వేస్టేషనులో జేబులు కొట్టే స్థాయి నుంచి వెన్నుపోట్ల వరకు ఎదిగి 5 లక్షల కోట్లు వెనకేసుకొని “హెరిటేజ్” తో సంపాదించానని కవరింగ్ ఇచ్చుకుంటున్నాడని అన్నారు. సొంత మామని వెన్నుపోటు పొడిచి చంపేసిన హంతకుడు, 5 లక్షల కోట్లు ప్రజలసొమ్ము కాజేసినోడు, ఇప్పడు అదాన్ డిస్టిలరీస్ మా అరబిందో కుటుంబానిదని ఆరోపిస్తున్నాడని మండిపడ్డారు. అదే నిజమైతే ఫ్రీగా రాసిచ్చేస్తాం ఏ పత్రం మీదైనా సంతకం పెట్టించుకో అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.

బాలల ఆరోగ్యం-జగన్ ప్రభుత్వ లక్ష్యం
నేటి బాలలే రేపటి నవభారత నిర్మాతలని బాలల దినోత్సవం సందర్బంగా ఆయన బాలలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న తరం పిల్లలకు మంచి ఆరోగ్యం, శుభ్రత అందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలల ఆధునికీకరణ చేపట్టి పిల్లల నమోదు గణనీయంగా పెంచిందని, నిరుపేదలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చేందుకు అనేక పథకాలు రూపొందించిందని అన్నారు. పిల్లల ఆరోగ్యం ప్రత్యేక దృష్టి సారించి పోషకాహార లోపం లేని సమాజం సృష్టించేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు.

 రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు
దేశంలోనే మొట్టమెదటి సారిగా దాదాపు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మించి ఇస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని విజయసాయి రెడ్డి అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు చొప్పున చెల్లిస్తోందని, దీంతోపాటు ఇంటికి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాన్ని పావలా వడ్డీకే సమకూరుస్తోందని అన్నారు. మరోవైపు ఉచితంగా ఇసుక, మార్కెట్ ధరల కన్నా తక్కువ రేటుకు సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తోందని అన్నారు.

Leave a Reply