Suryaa.co.in

National

ఆటల చావులు

ఇది ఖాళీ కడుపు తొక్కిసలాట కాదు..!!
కడుపు నిండిన తొక్కిసలాట..!!
ఆఫ్రికా లాంటి పేద దేశాలు, పాలస్థీనా లాంటి యుద్ధదేశంలో ఆకలి కోసం తొక్కిసలాట చావులు విన్నాం. కానీ… మన భారతదేశంలో ఆటల చావులు వింటున్నాము. గెలుపును స్పూర్తిగా తీసుకోవాలి. కానీ… 20 సంవత్సరాల లోపు పిల్లల ప్రాణాలు పోగొట్టు కోవాలా..??
చిత్ర విచిత్రమైన భారత చావులు.
క్రికెట్ స్టేడియం దగ్గర చావులు.
గుడి దగ్గర చావులు.

సినిమా హాల్ దగ్గర చావులు.
నదులు దగ్గర చావులు.
టిక్ టాక్ చావులు.
రోడ్లపై విన్యాసాల చావులు.
ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో చావులు.

ఏమి చేస్తున్నాం మనం. ఎటు పోతున్నాం మనం.
వాళ్ళు ఏమైన దేశాన్ని కాపాడిన సైనికులా..??
ప్రపంచాన్ని జయించిన విశ్వవిజేతలా..??
నోబెల్ ప్రైజ్, ఆస్కార్ గ్రహీతలా..??

మన మీద, మనం గెలిస్తే సంబరాలా..??
మనం మారనంత వరకు… మన దేశం మారదు.

మన పాలకులు మారరు. మన బ్రతుకులు మారవు.

భారతదేశం యువత ఆలోచించండి!!!.

LEAVE A RESPONSE