Home » గంగూలీకి అరుదైన గౌర‌వం

గంగూలీకి అరుదైన గౌర‌వం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కమిటీ మెన్స్ ఛైర్మ‌న్ గా BCCI అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీని నియ‌మించారు. దుబాయ్‌లో జరిగిన ICC బోర్డు సమావేశంలో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సౌర‌వ్ కి అరుదైన గౌర‌వం ల‌భించింది.
గత కొన్ని ఏళ్లుగా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ పదవి ఇస్తున్నట్లు ICC స్పష్టం చేసింది. ICC పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్ష పదవికి సౌరవ్‌ను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని… ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు గంగూలీ అని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు.

Leave a Reply