Suryaa.co.in

Andhra Pradesh

విశాఖలోని విలువైన భూములను దోచుకోవడం కోసమే రాజధాని పేరుతో గర్జనలు

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నిన్న మంత్రి రోజా, ఎంపీ మిథున్ రెడ్డి వైజాగ్ వెళ్లి గర్జించివచ్చారు ఎన్నికలకు ముందు అమరావతికి జోలపాడారు..ఇప్పుడేమో విశాఖ వెళ్లి గర్జిస్తున్నారు. మీరంటే విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు. మీకు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం విశాఖకు వెళ్లి గర్జించాలంటే 14 గంటలు బస్సుల్లో తిప్పలు పడాలా?

ప్రజల నాడి మీకు తెలిసినప్పటికీ జగన్ రెడ్డి ఏం చేసినా ఎస్ బాస్ అనాల్సిందే…లేదంటే మీరు దోచుకోవడం ఆగిపోతుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎవరైనా అమరావతికి వ్యతిరేకంగా నోరుతెరిస్తే ప్రజలు రాజకీయంగా మట్టుబెట్టడం ఖాయం. ఎన్నికలకు ముందు ఒక మాట…ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడం తగదు.

అమరావతికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.అప్పటి సీఎం చంద్రబాబు నాయుడి నిర్ణయానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం అందరూ మద్దతు పలికారు. ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న విశాఖపట్టణాన్ని మీరేమి కొత్తగా డెవలప్ చేయనవసరం లేదు.

విశాఖలోని విలువైన భూములను దోచుకోవడం కోసమే రాజధాని పేరుతో గర్జనలు.వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో హైదరబాద్ ను దోచుకున్నారు..ఇప్పుడు విశాఖపై పడ్డారు.అమరావతి రాజధానిగా కరెక్ట్ అని ఉత్తరాంధ్ర ప్రజల మనస్సాక్షికి తెలుసు..వారిని రెచ్చగొట్టే పనులు మానండి.విశాఖలో మంత్రులను జనసేన కార్యకర్తలు దుర్భాషలాడారంటూ పోలీసు అధికారులు తెగ బాధపడిపోతున్నారు. భూములను రాజధాని కోసం త్యాగం చేసి అరసవెళ్లికి పాదయాత్రగా వెళుతున్న రైతులతో వైసీపీ నేతలు అనుచితంగా ప్రవర్తించడం పోలీసులకు కనిపించడం లేదా? వైసీపీ నేతల డ్రామాలు, వారికి కొందరు పోలీసు అధికారులు వంతపాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు..తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.

LEAVE A RESPONSE