– మున్నూరు కాపు ప్రతినిధుల డి మాండ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్నిఅన్ని రాజకీయ పార్టీ లు మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాపు మున్నూరు కాపు ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్బంగా చందు జనార్దన్ మాట్లాడారు. తెలంగాణలో జనాభా దమాషా ప్రకారం అధికంగా ఉన్న మున్నూరు కాపు లకు ప్రాధాన్యం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక స్థానాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మున్నూరు కాపు మహాసభ సంఘం నాయకులు మంగళరాపు లక్ష్మణ్ మాట్లాడుతూ యువకుడు, ఉద్యమకారుడు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాపు మున్నూరు కాపు సంఘం నాయకులు అధికంగా పాల్గొన్న ఈ సమావేశం లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ బొంతు రామ్మోహన్ కి కేటాయించాలని తీర్మానం చేసి, ఆమోదించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, లండన్ డిప్యూటీ మేయర్ అరేటి ఉదయ్, కాసారం రమేష్, నియోజకవర్గంలోని సంఘ ముఖ్య నేతలు పాల్గొన్నారు.