-మానవతామూర్తి ఆర్డీటి వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్
-జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన టిడిపి యువనేత నారా లోకేష్
`దైవం మానుష రూపేణ’.. అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు అని అర్థం. అనంతపురం జిల్లావాసులకు ఫాదర్ ఫెర్రర్ దేవుడే. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి భారతదేశంలో అడుగిడి అనంతపురానికి వరమైన కారణజన్ముడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 103వ జయంతి సందర్భంగా ఆ మానవతా మూర్తికి నమస్కరిస్తున్నాను. ఆయన సేవాస్ఫూర్తికి జేజేలు పలుకుతున్నాను. ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో 1969లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ)ని ఆరంభించారు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. ఏభై ఏళ్ల ఆర్డీటీ సేవా ప్రస్థానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వేలాది గ్రామాలకు విస్తరించింది. విద్య, విజ్ఞానం, వైద్యం, శిక్షణ, ఉపాధి, అభివృద్ధి రంగాల ద్వారా ఆర్డీటీ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఆసుపత్రులు నిర్మాణం, పేదల అవసరాలకు ఆర్ధిక సహాయం, ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాంల నిర్మాణం, గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పనకు వేల కోట్లు ఖర్చు చేసిన ఆర్డీటీ ప్రజాప్రభుత్వం మాదిరిగా ప్రజాసంక్షేమానికి విశేష కృషి చేస్తోంది. అనంతపురం జిల్లాలో ఆర్డీటీ
సహాయం పొందని కుటుంబం లేదంటే అతిశయోక్తి లేదు. పేదపిల్లలు, పేదలు, మహిళ జీవితాల్లో వెలుగు నింపిన ఆర్డీటీ తెలుగు ప్రజలకి ఓ వరంగా అందించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవలు చిరస్మరణీయం.