Home » రైతు కోసం తెలుగుదేశం నినాదంతో హోరెత్తిన ఉభయ గోదావరి జిల్లాలు

రైతు కోసం తెలుగుదేశం నినాదంతో హోరెత్తిన ఉభయ గోదావరి జిల్లాలు

రాష్ట్రంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ హోరెత్తింది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
రైతుల సమస్యలను పరిష్కారించాలని వినూత్న పద్ధతిలో వ్యవసాయ యాంత్రాలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. చెరకు, టమోట, క్యాబేజీ, దోసకాయ, వరినాట్లు, మిర్చి, కాకరకాయ పంటలను రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వతంత్రంగా వేలాది మంది రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పర్యవేక్షణలో ఉభయగోదావరి జిల్లాల్లో అన్నీ నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ…
జగన్ రెడ్ది పాలనలో ఎక్కువ రైతు కుటుంబాలపై అప్పులున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున 2,45,554 అప్పు ఉన్నట్లు జాతీయ గణాంక కార్యాలయం సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా రైతుల అప్పు సగటున రూ. 74,121 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రైతుల అప్పు సగటున రూ. 2,45,554 గా ఉంది. కరోనా సమయంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి గాలికి వదిలేశారు. ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు నిలయాలుగా మారాయి. రెండేళ్లలోనే వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆక్వా రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 71.54 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాన్ని రెండేళ్లలో అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళకపోయారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఎత్తిపోతల, తాడిపూడి, చింతలపూడి వంటి సాగునీటి పథకాలకు సైతం గ్రహణం పట్టించారు. పోలవరం నిర్వాసితులను నిలువెల్లా మోసం చేసారు. దివీస్ పరిశ్రమ విషయంలో మాట తప్పి రైతులను మోసం చేసారు. కాకినాడ సెజ్ భూములపై మాటలు, ప్రకటనలు తప్ప అవేవీ ఆచరణలోకి రాలేదు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా రైతులు సమస్యలతో అల్లాడుతున్నారు.
కోనసీమలో ముంపు సమస్య వల్ల సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగును విరమించుకుని క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తోంది. అమలాపురం-అయినాపురం డ్రెయిన్‌ ద్వారా వచ్చే బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపు సమస్య తీవ్రంగా ఉంటోంది. డెల్టాలో పంట, మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది.
కాలువలు వెంటనే బాగు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంత రైతులకు మరో ప్రధాన సమస్య జగన్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టిన పంట కొనుగోలు బకాయిలు. ధాన్యం సొమ్ములు కోసం రైతులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. మొక్కజొన్న, ఆయిల్ పామ్ రైతులకు సైతం ఇదే సమస్య. ఉద్యాన పంటల సబ్సిడీ బకాయిలు కూడా పేరుకుపోయాయి. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని తెలుగుదేశం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు.నిరసన కార్యక్రమాలు జిల్లాల వారీగా
తూర్పుగోదావరి:
జగ్గంపేటలో పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది ట్రాక్టర్లుతో ప్రారంభమైన ర్యాలీ మామిడాడ, నరేంద్రపట్నం చేరుకోగా పోలీసులు కరోనా కారణాల దృష్ట్యా పర్మిషన్ లేదని ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో టీడీపీ నాయకులు నిరసనకు దిగడంతో సీఐ సురేష్ బాబు ఉన్నతాధికారులతో మాట్లాడి ఎమ్మార్వో సరస్వతిని నరేంద్రపట్నం తీసుకొచ్చారు. అక్కడ నవీన్ గారు రైతు సమస్యలపై ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు.
ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో తలపెట్టిన “రైతుకోసం తెలుగుదేశం” ట్రాక్టర్ ల ర్యాలీని బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్న పోలీసులు..
వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మండపేట నియోజకవర్గ రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారుకు రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రైతులతో కలిసి పాదయాత్ర చేశారు. ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వరిదిబ్బులతో పాదయాత్రగా వెళ్ళి వినతిపత్రం అందజేశారు. పి.గన్నవరంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు నామన రాంబాబు, డొక్కా జగన్నాధం ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీ చేస్తుండగా అడ్డుకోవటంతో ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను అక్కడే వదిలి నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు.
రామచంద్రపురం ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ ట్రాక్టర్ల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. ప్రత్తిపాడులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో టీడీడీ కార్యాలయం నుంచి ధర్మవరం వరకు రైతు కోసం తెలుగుదేశం అనే వినాదంతో ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ధాన్యం బస్తాలను రోడ్డుపై వరుసగా పెట్టి వాటికి రైతుల డిమాండ్స్‌ తో కూడిన పోస్టర్లను అంటించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై వరి నాట్లు నాటి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని , పోలీసులు అడ్డుకోవడంతో రంగంపేట సెంటర్‌లో ఏడిబి రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు. పిఠాపురం ఇన్‌చార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి బంగారమ్మ రావి చెట్టు సెంటర్‌ వరకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ బైఠాయించి ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం రైతు సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ర్యాలీ చేసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ముమ్మిడివరంలో పర్మిషన్ ఇవ్వకపోవడంతో దాట్ల సుబ్బరాజు పాదయాత్రగా వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు. బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రైతులు, కార్యకర్తలు అరటి గెలలతో పాదయాత్ర చేశారు. పెందుర్తి వెంకటేశ్ కోరుకొండ మండల కేంద్రంలో నిరసన తెలిపి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా
ఉంగుటూరులో పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ఎడ్లబండిపై గొల్లగూడెం విద్యుత్ ఉపకేంద్రం వరకు పాదయాత్ర చేసి రైతులకు మీటర్లతో ఉరి వేయ వద్దు, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి అంటూ విద్యుత్ ఉపకేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. అక్కడ నుంచి పోలవరం కాలవ వరకు రాలీగా వెళ్ళి పట్టిసీమ కాలువలో దిగి నిరసన తెలియజేశారు.
ఏలూరు ఇన్‌చార్జ్ బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతులు వినూత్న పద్దతిలో నిరసనలు చేశారు. చెరకు, టమాటా, క్యాబేజీ, దోసకాయ, వరినాట్లు, మిర్చి, కాకరకాయ పంటలను రోడ్డుపై పోసి నిరసన తెలిపి తహశీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆధ్వర్యంలో పాలకొల్లు మండలం మైజారుగుంట గ్రామంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన రైతుల పంట పొలాల నీటిలో దిగి 200 అడుగుల భారీ నల్లజెండాతో, వందలాది మంది రైతులతో కలిసి నిరసన తెలియజేశారు. కొవ్వూరులో పార్లమెంట్ అధ్యక్షులు కె.ఎస్ జవహార్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో నిరసన తెలియజేశారు. చాగల్లు, కొవ్వూరు మండలాల్లోని నందమూరు పసివెదల, వాడపల్లి , దొమ్మేరు గ్రామాలలో ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్ళి నీట మునిగిన పంటలను పరిశీలించారు.
భీమవరంలో పార్లమెంట్ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో వీరవాసరం గ్రామం బాలేపల్లి రోడ్డులో వ్యవసాయ యాంత్రాలు, ఎడ్లబండ్లతో నిరసన తెలియజేసి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిగూడెంలో రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. చింతలపూడి నియోజవర్గ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో పాదయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆచంటలో నియోజకవర్గ, మండల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. నరసాపురంలో ఇన్‌చార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు ఆధ్వర్యంలో ఎడ్ల బండులకు ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు కట్టుకుని ర్యాలీ చేశారు.
వరిదుబ్బులు, చేపలు, కొబ్బరికాయలను వినూత్నంగా ప్రదర్శించి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తణుకులో నరేంద్ర సెంటర్‌లో వ్యవసాయ యంత్రాలతో నిరసన తెలిపారు. ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెలీ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో పాలకోడేరు గ్రామంలో రావి చెట్టు సెంటర్ దగ్గర తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిరసన జరిగింది. టీడీపీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండి నడుపుతూ నిరసన తెలిపారు.
కృష్ణా జిల్లా:-
నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మామిడికి మద్దతు ధర లేక మామిడి చెట్లను తొలగిస్తున్న తోటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను వినతిపత్రం రూపంలో తహశీల్దార్‌కు అందజేశారు. కైకలూరులో నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ఆటపాక నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు త్రినాథ్ రాజు నాగలి చేతితో పట్టుకుని వినూత్నంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Leave a Reply