Home » సీఐడీ కన్ను కీలకమైన వ్యక్తైన గౌరీశంకర్ పై ఎందుకు పడలేదు?

సీఐడీ కన్ను కీలకమైన వ్యక్తైన గౌరీశంకర్ పై ఎందుకు పడలేదు?

– గౌరీశంకర్ ని ఏకుట్రలో భాగంగా, ఏపీ ఎస్ఎఫ్ ఎల్ ఈడీగా నియమించారు?
– అందుకు సహకరించిన అదృశ్యశక్తి ఎవరో తేల్చాల్సిన బాధ్యత సీఐడీపై లేదా?
• ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో 18 మందిని విచారిస్తున్న సీఐడీ, ప్రభుత్వానికి ఫేక్ డిగ్రీసర్టిఫికెట్లు సమర్పించిన గౌరీశంకర్ పై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదు?
• తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చిన ఆదేశాల్లో గౌరీ శంకర్ పేరులేదా?
• సిగ్నమ్ డిజిటల్ నెట్ వర్క్ సంస్థ టెరాసాఫ్ట్ కు ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ ధ్రువీకరణ పత్రాన్ని తప్పుపట్టిన సీఐడీ, అదే సిగ్నమ్ సంస్థలో పనిచేసిన గౌరీశంకర్ ని ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఈడీగా నియమించిన జీవోపై సీఐడీ ఎందుకు దర్యాప్తుచేయలేదు?
* టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కొనసాగుతున్న సీఐడీ విచారణలో 18మందిపైకేసు నమోదుచేశారని, వారిలోముగ్గురు వేమూరి హరిప్రసా ద్, కే.సాంబశివరావు, గోపీచంద్ లను విచారణకు పిలిచారని, నిరాధార మైన ఆరోపణలను ముందుకుతీసుకొచ్చి, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను అటకెక్కించేప్రయత్నాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు.
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టమెంట్ కాస్త ఈ ప్రభుత్వంలో క్రెడిబుల్ ఇన్ సాల్వేషన్ డిపార్ట్ మెంట్ గా మారింది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తాడేపల్లి కనుసన్నల్లో గంగిరెద్దు ఆడమన్నట్లు ఆడుతున్నాడు. ఎందు కు అలా అంటున్నామంటే సీఐడీ విభాగం పక్షపాత వైఖరి అలా ఉంది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లు నమోదుచేసిన సీఐడీ అధికారులను కొన్నిప్రశ్నలుఅడుగుతున్నాం. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న కే.గౌరీశంకర్ సిగ్నమ్ డిజిటల్ నెట్ వర్క్ కంపెనీకి చెందిన వ్యక్తి. అదే సిగ్నమ్ సంస్థ టెరాసాఫ్ట్ సంస్థకు ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ ధ్రువీకరణపత్రాన్ని సీఐడీవారు తప్పుపడుతున్నారు. తప్పుడుపత్రాలిచ్చారని సీఐడీ చెబుతున్న సంస్థకు చెందిన గౌరీశంకర్ నే ఏరికోరి ప్రభుత్వం ఏపీ ఎస్ఎఫ్ ఎల్ కి ఈడీగా (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) ఎందుకు నియమించిందో సీఐడీ దర్యాప్తుచేసిందా?
ఆ పదవికి 15 మందివరకు ఉన్నతవిద్యార్హతలు కలిగినవారు పోటీపడితే, ఎలాంటి విద్యార్హతలు లేని గౌరీ శంకర్ కే ప్రభుత్వం ఎందుకుఈడీ పోస్ట్ ఇచ్చిందో సీఐడీ కనిపెట్టిందా? గౌరీ శంకర్ కు పదవినికట్టబెట్టి ఏరకంగా ప్రభుత్వం లొంగదీసుకుందో సీఐడీ విచారించలేదా? ఇవేవీ తేల్చకుండా సీఐడీ విభాగం ఎందుకు ఏమీ తెలియనట్టు నటిస్తోంది? గౌరీ శంకర్ తనవిద్యార్హతలకు సంబంధించి ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ కూడా ఫేక్ అని తేలింది. ఆ విషయం సీఐడీ వారికి తెలియదా? సర్టిఫికెట్లు ఫేక్ అని మేము అనడంకాదు, సమాచారహక్కు చట్టం ద్వారా అడిగినప్రశ్నకు సమాధానంగా ఏపీఎస్ ఎఫ్ ఎల్ వారిచ్చిన సమాధానంలో వారే చెప్పారు. ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీ పదవికోసం గౌరీ శంకర్ ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చాడని చెబుతుంటే, ఎందుకని సీఐడీదృష్టి అతనిపైకివెళ్లడంలేదు? ఏ ప్రభుత్వపెద్దల ఒత్తిడితో అతన్ని వదిలేస్తున్నారు?
ఏ ఫైబర్ నెట్ వ్యవహారంపై అయితే సీఐడీ దర్యాప్తు చేస్తోందో, ఏ సిగ్నమ్ కంపెనీఇచ్చిన ఎక్స్ పీరియన్స్ ధ్రువీకరణ పత్రాలపై అయితే విచారిస్తు న్నారో, అవి ఇచ్చిన వ్యక్తిగౌరీశంకర్ ని ఎవరిప్రోద్బలంతో ఏపీఎస్ఎఫ్ ఎల్ డైరెక్టర్ గా నియమించారో సీఐడీ ఎందుకుతేల్చడం లేదు ? ఎవరి ఆమోదంతో ఆ నియామకం జరిగిందనే దానిపై సీఐడీ ఎందుకు దృష్టిపెట్టలేదు. అది కీలకమైన అంశంకాదా? జీవోనెం 66 విడుదల వెనుక ఎవరి అదృశ్యహస్తముంది?
ఏపీ ఎస్ఎఫ్ ఎల్ ఈడీగా నియమించాక గౌరీ శంకర్ ఏరకంగా ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అంశాలపై ప్లేటు ‎ఫిరాయించాడో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఎందుకు తేల్చడంలేదు? అదికీలంకం కాదా? తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ లో ఆ అంశాలేవీ లేవా? అందుకే అన్నది తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్న ట్లు ఆడుతున్నారని.
ఎవరైనా సాధారణ వ్యక్తి తప్పుడుపత్రాలిచ్చి ఏదైనా ఉద్యోగంలోకి రావడానికి ప్రయత్నిస్తే, అతన్ని వెంటనే శిక్షిస్తారు కదా.. మరి ఈ గౌరీశంకర్ ఏపీఎఫ్ ఎస్ ఎల్ వారు తొలగించాక అతన్నెం దుకు శిక్షించలేదు? అతన్ని గతంలో ఆరకంగా వదిలేసి, ఇప్పుడు మరలా రాచమర్యాదలు చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వంలో చట్టం అమ లవుతున్న తీరు? గౌరీ శంకర్ నియామకం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తముంది. అతన్ని లొంగదీసుకొని, ప్రలోభపరిచే అతనితో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై ఆరోపణలు చేయిస్తున్నారు. అతను ప్రభుత్వానికి సమర్పించి న దొంగసర్టిఫికెట్ల వెనకకూడా ప్రభుత్వపెద్దల హస్తముంది. ఎటువంటి విద్యార్హతలు లేని గౌరీశంకర్ ను, కుట్రలోభాగంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీ గా కూర్చోబెట్టడంకోసం తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో కొంతమంది ప్రభుత్వపెద్దలు దొంగ డిగ్రీసర్టిఫికెట్లను సృష్టించారు.
ఇంత వ్యవహారం జరిగితే సీఐడీ గౌరీశంకర్ పై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఏ కుట్రలో భాగంగా అతను ఏపీఎస్ఎఫ్ఎల్ కు ఈడీగా వచ్చాడో కూడా తేల్చాలి. ఇవేవీ చేయడానికి మాత్రం సీఐడీ ముందుకురాదు. ఇంతనీచంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి సరెండర్ అయ్యి, తాడేపల్లి ప్యాలెస్ పాలేరులు ఆడమన్నట్లు ఆడుతున్నారు కాబట్టే, విశ్వసనీయత కోల్పోయారు. తక్షణమే సీఐడీ విభాగం గౌరీ శంకర్ పై కేసు నమోదు చేయాలి. ప్రభుత్వమిచ్చిన సమాచారహక్కుచట్టం తాలూకా సమాచారం చాలు గౌరీశంకర్ పై సీఐడీ వారు కేసుపెట్టడానికి. ఈరకంగా, ఇంతపక్షపాతంగా వ్యవహారిస్తున్నారు.
కాబట్టే సీఐడీని క్రెడిబుల్ ఇన్ సాల్వేషన్ డిపార్ట్ మెంట్ అంటున్నది. గౌరీశంకర్ నియా మకంవెనకున్న పెద్దలు, అతన్ని సిఫార్సుచేసిన పెద్దలెవరో సీఐడీనే తేల్చాలి. అతన్ని నియమించడానికి దొంగ సర్టిఫికెట్లుఎవరు సృష్టించారో కూడా తేల్చాలి. అవేవీచేయకుండా వివరాలు సేకరించామనిచెప్పి, తప్పుడు ఎఫ్ఐఆర్ లు పెట్టి, బ్రహ్మండంగా దర్యాప్తుచేస్తున్నామని చెప్పుకుంటేసరిపోదు. ఇప్పుడు మేము లేవనెత్తినవాటిపైచర్యలు తీసుకొని అప్పుడు మాట్లాడండి.
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో వందలకోట్ల అవినీతి జరిగిందని ఎఫ్ఐఆర్ లో రాశారు. సాధారణంగా ఫైబర్ నెట్ వర్క్ కేబులింగ్ అండర్ గ్రౌండ్ లో వేస్తారు. అలాచేస్తే 24వేలకిలోమీటర్లకు దాదాపు రూ.4వేలకోట్లుఖర్చ వుతుంది. కానీ చంద్రబాబునాయుడి ప్రభుత్వం, తక్కువఖర్చుతో ప్రజలకు గొప్పసౌకర్యం కల్పించాలని, అతి తక్కువగా కేవలం రూ.330 కోట్లతోనే రాష్ట్రవ్యాప్తంగా 24వేలకిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేయి స్తే దానిపై బురదజల్లుతారా? టీడీపీప్రభుత్వం రూ.3,700కోట్లు ఆదాచేసిందని జాతీయ మీడియాకూడా కొనియాడింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అంతతక్కువఖర్చుతో 24వేలకిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసిన ప్రాజెక్ట్ ఉందా?
రూ.3,700కోట్లుఆదాచేస్తే దానిలో అవినీ తి జరిగిందని ఆరోపిస్తారా? డిజిటల్ఇండియా కింద చేపట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగమైన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను టీడీపీప్రభుత్వం కేవలం 6నెలల్లోనే విద్యుత్ స్థంభాల ఆధారంగా పూర్తిచేసింది. విద్యుత్ స్తంభాల ద్వారా తమప్రభుత్వం ప్రజలకు మూడురకాల సేవలందిస్తే, నేడు జగ న్మోహన్ రెడ్డి విద్యుత్ బిల్లులతోనే ప్రజలకు షాక్ లు ఇస్తున్నాడు. విద్యు త్ శాఖా ద్వారా గతప్రభుత్వం రూ.3,700కోట్లు ఆదాచేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం రూ.9,500కోట్ల భారాన్ని విద్యుత్ ఛార్జీల పెంపుపేరుతో ప్రజ లపై వేసింది. అదిచాలదన్నట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి దాదా పు రూ.24వేలకోట్లు అప్పులుతెచ్చింది.
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా, చంద్రబాబునాయుడి ప్రభుత్వం రాష్ట్రంలో 14,770 సీసీకెమెరాలు బిగించింది. ఆ వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టుపట్టించింది.
దానిపర్యవసానమే ఎన్ సీబీఆర్ నివేదిక. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగాయి. 14,770 సీసీకెమెరాలు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేస్తే, దాన్ని అట కెక్కించారు. దానివల్లనిత్యం ఎన్నిఘోరాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. నిన్నవిడుదలైన ఎన్ సీఆర్ బీ నివేదికలో మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో ఒక్కసంవత్సరంలోనే 63శాతం పెరిగాయని తేటతెల్లమైంది. అందుకు కారణం ఫైబర్ నెట్ లాంటి అద్భుతమైన వ్యవస్థను భ్రష్టుపట్టించడంకాదా? సీఐడీవిభాగం వారు రోజూ కొన్నిగంటలతరబడి ఎందరిని విచారించినా కూడా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో 120పైసల అవినీతిని కూడా నిరూపించలేదు.
గతప్రభుత్వంచేసిన మంచిపనులను నిలిపేయడం, టీడీపీ అధినేతపై తప్పుడు ఆరోపణలుచేయడం… ఇదే పనిలో ప్రభుత్వం, బులుగు మీడి యా ఉన్నాయి. గౌరీశంకర్ వ్యవహారమేంటో, అతని వెనకున్నది ఎవరో, అతని తప్పుడువిద్యార్హత పత్రాలసృష్టికర్తలెవరో, అతన్ని ఏపీఎస్ ఎఫ్ఎల్ ఈడీగా నియమించమని చెప్పిందిఎవరో సీఐడీ తేల్చాలి. అప్పుడే సీఐడీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ప్రజలదృష్టిలో క్రెడిబుల్ ఇన్ సాల్వేషన్ డిపార్ట్ మెంట్ గానే మిగిలి పోతుంది.

Leave a Reply