Suryaa.co.in

Andhra Pradesh

వైజాగ్ కు త్వరలో గూగుల్ అదిరిపోయే వార్త?

– భారీ డాటా సెంటర్లు, అత్యాధునిక అనలిటిక్స్ కార్యకలాపాలు?
( బాబు. బి)

ఆంధ్రా ఆనందానికి అవధులు వుండవు. దేశం మొత్తం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా.. జన కేరింతలతో విశాఖపట్నం మారుమోగేలా.. త్వరలో ఓ అదిరిపోయే ప్రకటన రాబోతోంది! ప్రపంచ దిగ్గజం గూగుల్ మన వైజాగ్‌కు వస్తోంది! భారీ డాటా సెంటర్లను, అత్యాధునిక అనలిటిక్స్ కార్యకలాపాలను ఇక్కడ నుంచే చేపట్టబోతోంది. ఈ వార్తతో వైజాగ్ ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయం.

అయితే, ఈ వార్త వింటే… వైకాపా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, నిద్రలేని రాత్రులు గడుపుతారు! టీసీఎస్, ఉర్సా క్లస్టర్స్ వంటి సంస్థలు వచ్చినా తట్టుకోలేక వాళ్లు పడిన బాధ అంతా ఇంతా కాదు, పసిపిల్లల్లా పడి ఏడ్చారు! ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దిగ్గజం గూగుల్ వస్తుందని తెలిస్తే.. వాళ్ళ ఏడుపు ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది!

“బాబాయి గొడ్డలిపోటు” కేసులో గూగుల్ టేకౌట్ల ద్వారానే సీబీఐ నిందితులను గుర్తించిందని తెలియగానే, వైకాపా నేతలు ఎంతగా అల్లాడిపోయారో గుర్తుందా? ఆ పగతో ఇప్పుడు గూగుల్ రాక గురించి ఇంకెంతగా ఏడుస్తారో, ఎంతగా పెడబొబ్బలు పెడతారో చూడాలి! ఎవడు అడ్డం పడ్డా.. ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని హాహాకారాలు చేసినా.. వాళ్లందరినీ తొక్కొకుంటూ విశాఖపట్నం ముందుకు దూసుకుపోతుంది. ఆంధ్రా ఐటీ హబ్‌గా మారుతుంది.

LEAVE A RESPONSE